‘మత్యుంజయడు’ చంద్రశేఖర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు

Published : Aug 17, 2017, 07:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
‘మత్యుంజయడు’ చంద్రశేఖర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు

సారాంశం

బోర్ బావి లో పడి పోయి సురక్షితంగా బయటకొచ్చిన బాలుడితో  ముఖ్యమంత్రి ముచ్చట్లు

గుంటూరు జిల్లా, వినుకొండ మండలం, ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడు చంద్రశేఖర్ ను రక్షించిన  సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ రోజు చంద్రశేఖర్ , కుటుంబ సభ్యులు  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తో కలసి ముఖ్యమంత్రి ని కలిశారు.  చంద్రబాబు  చంద్రశేఖర్ ని ఎత్తుకుని ముచ్చట్లాడారు. చంద్రశేఖర్ పేరు మీద రెండు లక్షలను  20 సంవత్సరాలకు డిపాజిట్ చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడివరం లో బొరు బావిలో పడిన రెండు సంవత్సరాల చంద్రశేఖర్ ని  ఎన్ డి ఆర్ ఎఫ్  సిబ్బంది, అధికారుల సహాయంతో విజయవంతంగా వెలికి తీశారు. కలెక్టర్ కొనా శశిధర్, రూరల్ ఎస్పీ అప్పల నాయుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !