ప్రవాసాంధ్రుల భవనానికి ‘A’ ఆకారం, చంద్రబాబు ‘తెలుగు’ ప్రేమ

Published : Sep 16, 2017, 07:00 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ప్రవాసాంధ్రుల భవనానికి  ‘A’ ఆకారం, చంద్రబాబు ‘తెలుగు’ ప్రేమ

సారాంశం

రాష్ట్రం తెలుగు రాష్ట్రం, పార్టీ తెలుగుదేశం. సంస్థ ప్రవాసాంధ్రుల కోసం అయితే ప్రవాసాంధ్రుల కార్యాలయానికి మాత్రం ఇంగ్లీష్ A-maravati మొదటి అక్షరం కావాలి తెలుగు అక్షరాలు ఐకానిక్ భవనాల డిజైన్ కు పనికిరావా?  

 

అమరావతిలో  ప్రవాసాంధ్ర భవన్ డిజైన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆమోదం తెలిపారు. ఎపీఎన్ఆర్‌టీ ( ఆంధ్రప్రదేశ్  నాన్ రెసిడెంట్ తెలుగు)  పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ డిజైన్లను పరిశీలించి ఆమోద ముద్రవేశారు. అమరావతి నిండా ఐకానిక్ భవనాలే ఉంటాయి. హై కోర్టు,అసెంబ్లీ, ముఖ్యమంత్రి నివాసం, రాజ్ భవన్ దేనికదే సాటి గా ఉండాలని ముఖ్యమంత్రి  ఎంతో తపన చెందుతున్నారు. అన్నింటిని విదేశీ నిపుణేలే రూపొందిస్తున్నారు.  అయితే, రాజధానికి సంబంధించివనవేవీ ఎంతకూ ఖరారు కావడంలేదు. ఈ రోజు మొదటి గ్రాఫిక్ డిజైన్ ఒకె అయింది. ఆశ్చర్యం మేమిటంటే,  ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చినవన్నీ తెలుగుజాతి, తెలుగు నృత్యం, తెలుగు దేవుడు వెంకన్న. ప్రవాస తెలుగు ప్రజలు... అయితే, అమరావతి ఇంగ్లీషు పేరు లోని మొదటి ఆంగ్ల అక్షరం ‘ఏ’ని ప్రతిబింబించేలా ప్రవాసాంధ్రుల కార్యాలయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.  భవనం మధ్యలో ఏర్పాటు చేసే డిజిటల్ గ్లోబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అన్నారు. దీనికి సీఆర్‌డీఏ 4.6 ఎకరాల భూమిని కేటాయించగా 10 ఎకరాల వరకు అవసరం వుందని పాలకమండలిలో పలువురు సభ్యులు కోరగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !