ఏది ఏమయినా కొత్త సెక్రటెరియట్ కట్టితీరతాం

First Published Nov 1, 2017, 12:00 PM IST
Highlights
  • ఇపుడున్నది దరిద్రపు గొట్టు సెక్రెటేరియట్.
  • రాష్ట్రానికి తగ్గ సెక్రెటేరియట్ ఉండాలి. 
  • వితండవాదం మానుకొమ్మని ప్రతిపక్షాలకు  సిఎం సలహా

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ని నిర్మించితీరతామని దీనిపై  పై వితండవాదం వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీలో  శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జోక్యం చేసుకుంటూ నూతన సచివాలయంపై సీఎం మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు మంచి సెక్రెటేరియట్ లు ఉంటే ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదని అన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.

ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదు. సెక్రటేరియట్‌లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే స్థలం లేదు.  సీ బ్లాక్ అయితే మరీ దారుణంగా ఉంది. ఇష్టం వచ్చిన రీతిలో సచివాలయాన్ని కట్టారు. సచివాలయంలో ఫైర్ సెఫ్టీయే లేదు.  దేశంలో ఏ రాష్ర్టానికి పోయినా అక్కడి సచివాలయం ఆ రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉంటుంది. మనం కూడా అలాగే నిర్మించుకోవాలి,’ అని చెప్పారు. 
కొత్త సచివాలయ నిర్మాణానికి రూ. 180 కోట్లకు మించి ఖర్చు కాదని ముఖ్యమంత్రి అన్నారు. 
నూరేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని నిర్మాణాలు చేపడతామని ఆయన ఆన్నారు. ఈ నిర్మాణాలు తనకొచ్చిన ఆలోచన కాదని.. 1969కంటే ముందు… నీలం సంజీవరెడ్డి కాలంలోనే తీసుకున్నారని ఆయన చెప్పారు. నాటి ముఖ్యమంత్రి  బ్రహ్మానందరెడ్డి హాయాంలో కూడా ఈ ఆలోచన ఉండిందని.. అయితే అవి ముందుకు సాగలేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇపుడున్న భవనాలకు  జీహెచ్ఎంసీ అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. పార్కింగ్ , అగ్ని ప్రమాదాలనుంచి రక్షణ సదుపాయాలు కూడా  లేవని చెబుతూ  కొత్త సెక్రటేరియట్, శాసనసభ నిర్మాణం చేపట్టామని ఆయన వివరణ  ఇచ్చారు.
 

లక్ష్మణ్ హెచ్చరిక


అయితే సెక్రటేరియట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి  సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని బిజెపి నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. నగరాలలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో నిర్మాణాలను చేపట్టంమీద  సుప్రీం కోర్టు ఆదేశాలు స్పష్టంగా  ఉన్నాయని.. ఖాళీ స్థలాలు కాపాడాలని సుప్రీం ధర్మాసనం చెబుతున్నదని లక్ష్మణ్ అన్నారు. భేషజాలకు పోకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తూ  ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూసుకుటారని, వారే  నిర్ణేతలని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
 

click me!