రెండేళ్ల తర్వాత నగరానికి మంజీరా వాటర్..!

First Published Aug 30, 2017, 11:47 AM IST
Highlights
  • హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలకు  గత కొంతకాలంగా మంజీరా వాటర్ రావడం లేదు
  • 2015 అక్టోబర్ లో  నిటి సరఫరా ని నిలిపివేశారు.

హైదరాబాద్ నగరానికి మంజీరా వాటర్ సప్లై అయ్యింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మంగళవారం రాత్రి మంజీరా నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలకు  గత కొంతకాలంగా మంజీరా వాటర్ రావడం లేదు. కాగా.. ప్రభుత్వ కృషి కారణంగా నిన్న వాటర్ సప్లై జరిగింది.

బంజారా హిల్స్, జూబ్లి హిల్స్, అమీర్ పేట, మాదాపూర్, హఫీజ్ పేట్, సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలకు దశాబ్ద కాలంగా మంజీరా వాటర్ సప్లై జరిగింది. అయితే.. 2015 అక్టోబర్ లో  నిటి సరఫరా ని నిలిపివేశారు. మెదక్ జిల్లాలోని ప్రజలకు మంచినీటి, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు నగరంలోని ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా ఆపేశారు.

అయితే.. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నీటి కొరత ఏర్పడింది. నాగార్జున సాగర్, కృష్ణా బేసిస్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై సీఎం మంత్రి హరీష్ రావుతో చర్చించారు.ఆయన సూచనల మేరకు మంగళవారం మంజీరా వాటర్ ని నగర వాసులకు అందించారు. అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలకు ఉద్యాసముద్రం ప్రజెక్టు నుంచి తాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి రోజుకి 400 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉంది. కాగా.. ఈ నీటిని సింగూర్( మంజీరా-100 మిలియన్ గాలన్లు), నాగార్జున సాగర్( కృష్ణా జలాలు-180 మిలియన్ గ్యాలన్లు),యెల్లంపల్లి ( గోదావరి-120 మిలియన్ గ్లాలన్లు)ల నుంచి సరఫరా చేస్తున్నారు.

నాగార్జున సాగర్ నుంచి నగరానికి వస్తున్న నీటిని 90మిలియన్ గ్యాలన్లకు కుదించి.. మిగిలిన నీటిని నల్లొంగడ ప్రజల కోసం ఉద్యాన సముద్రం ప్రాజెక్టుకు తరలించనున్నామని వాటర్ బోర్డు డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 

 

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి 

click me!