
ఐపీఎల్ లీగ్ సమరం చివరి దశ వరకూ ప్లే ఆఫ్స్‌లో తలపడే ఆఖరి రెండు జట్లుకోసం ఉత్కంఠగా వేచిచూడాల్సి రావడం. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడో ప్లే ఆఫ్స్ ప్లేసులు ఖరారు చేసుకోగా.. మూడో బెర్త్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ శనివారమే ఖాయం చేసుకుంది. ఆదివారం నాటి తొలి పోరులో ఢిల్లీ చేతిలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై చెన్నై నెగ్గి ప్లేఆఫ్స్‌లో రెండో జట్టు స్థానాన్ని నిలబెట్టుకోగా.. రాజస్థాన్ నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది.