4వ స్థానానికి పడిపోయిన చంద్రబాబు

First Published Aug 19, 2017, 6:50 AM IST
Highlights
  • ఎక్కడున్నా బాగా సౌండ్ చేసే చంద్రబాబు నాయుడు పనితీరులో నాలుగో స్థానానికి పడిపోయాడు.
  • పెద్ద పెద్ద మాటలు రాని సింపుల్ మనిషి మమతా బెనర్జీ నెంబర్ వన్
  • మొదటి  అయిదు స్థానాల్లో  మాటల మరాఠా కెసిఆర్ లేడు

అనుభవం, ఆకారం, పెద్ద పెద్ద మాటలు,  ప్రచారంలో ద్వితీయుడు, వర్ ల్డ్ క్లాస్ స్టయిలూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబు నాయుడు పనితీరులో మాత్రం పాతాళంలో ఉన్నారు.ఆయన ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉన్నాడని ఇండియా టు డే తాజా సర్వే వెల్లడించింది. ఇది కొంచెం ఇబ్బంది కరమయిన వ్యవహారమే. ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ తర్వాత విదేశాలన్నితిరిగి రాష్ట్రాభివృద్ధికి, తద్వార దేశాభివృద్ధికి తోడ్పడాలనుకుంటున్నది చంద్రబాబే. అయినా నాలుగోొ  స్థానం రావడం ఆశ్చర్యమే.  అంతా ఉత్త డాంబికమేనా?

మరొక ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే, మొదటి ర్యాంకు, అంతగా ఎవరూ సీరియస్ గ తీసుకోని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి దక్కింది. రెండవ  స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఉంటే, మూడవ స్థానం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కువెళ్లింది. ఈ సర్వేలో  తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు మొదటి అయిదు స్థానాలలో చోటు దక్కలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్విద్ కేజ్రీవాల్ కు అయిదో ర్యాంకు లభించింది.

 

click me!