చంద్రబాబు అత్యాశ..!

First Published Oct 29, 2017, 11:35 AM IST
Highlights
  • తెలుగువారు గర్వపడేలా అమరావతి ఉండాలన్న చంద్రబాబు
  • వెయ్యేళ్లయినా కొత్తగా ఉండేలా డిజైన్లు రూపొందించామన్న చంద్రబాబు

‘ రాజధాని డిజైన్లు ఎప్పటికీ నూతనంగా ఉండాలి. వెయ్యేళ్ల తర్వాత కూడా అమరావతి కొత్తగా కనిపించాలి. తెలుగువారందరూ గర్వపడేలా ఉంటుంది’ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక. ప్రపంచంలో అన్నింటికల్లా తమ రాజధాని నిర్మాణం అద్భుతంగా ఉండాలని చంద్రబాబు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అది సాధ్యమయ్యే పనేనా?

ప్రస్తుత కాలంలో అందరూ టెక్నాలజీ వెంట పరిగెడుతున్నారు. ఈ రోజు కొత్తగా ఉన్నది రేపటికి పాతది అయిపోతున్న రోజులివి. ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఒక దానిని మించి మరోకొటి తయారు చేస్తున్నారు. ఎందరో గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్లు ఉన్నారు.  ఒక భవనాన్ని మించి మరో భవనాన్ని నిర్మించగల సత్తా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి పోటీ ప్రపంచంలో మన రాజధానే వెయ్యేళ్ల తర్వాత కూడా కొత్తగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.

2018లో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. రెండున్నరేళ్లలో  డిజైన్ల ఎంపికే పూర్తి కాలేదు. ఇక రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలియదు. మహా అయితే వచ్చే ఎన్నికల నాటికి పునాది వేసే అవకాశం ఉంది. అలాంటి రాజధాని వెయ్యేళ్లు కొత్తగా ఉండాలని చంద్రబాబు కోరుకోవడం నిజంగా అత్యాశే. ముందస్తు ఎన్నికలలను దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకును విస్తరించుకునేందుకే చంద్రబాబు ఇంతలా తాపత్రయపడుతున్నారనే విషయం స్పష్టం అవుతోంది.

click me!