ఉత్తుత్తి ఆగ్రహమేనా?

First Published Oct 29, 2017, 10:58 AM IST
Highlights
  • మంత్రిపై చంద్రబాబు ఆగ్రహం
  • అధికారుల పనితీరుపై అసంతృప్తి  వ్యక్తం చేసిన చంద్రబాబు
  • అంతా ఉత్తుత్తిదే అంటూ పలువురి వాదన

‘‘విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌లు ఇప్పటికే పర్యటన ముగించుకుని రావాల్సి ఉంది. అయినా ఇంకా రాలేదు. విదేశాల్లో ఒక రోజు రెండు రోజులు పని ఉంటుంది. ఇన్ని రోజులు అక్కడే ఉంటే ఎలా? ఎవర్నైనా ఎక్కడికైనా (విదేశాలకు) పంపించాలంటే భయపడాల్సి వస్తోంది’’.ఈ మాటలు  అన్నది ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సీఎం చంద్రబాబు..  మంత్రి గంటా, ఆయన కార్యదర్శి  ఆదిత్యనాథ్ దాస్ లను ఉద్దేశించి అన్నమాటలవి.

మీడియా ముఖంగా తాజాగా అధికారులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న గంటా విషయంలో అయితే మరింత ఫెయిల్ అయ్యారు. అన్ని రోజులు విదేశాల్లో పర్యటిస్తారా అని కూడా అన్నారు. అయితే.. అసలు నిజాలు మాట్లాడుకుంటే.. మంత్రులు ఎవరైనా విదేశీ పర్యటనకు వెళ్లాలి అంటే..సీఎం పర్మిషన్ తప్పనిసరి. ఆయన అనుమతి ఇస్తేనే వాళ్లు వెళ్లడానికి కుదురుతుంది.

అంతేకాదు.. మంత్రుత్వశాఖల ప్రధాన కార్యదర్శులు విదేశాలకు వెళ్లాలన్నా కూడా సీఎంవో అనుమతి అవసరం. మరి అనుమతి ఇచ్చేటప్పుడు చంద్రబాబుకి తెలియదా.. మంత్రి అన్ని రోజులు విదేశాలకు వెళ్తున్నట్లు..? ఆయన అనుమతి తోనే కదా వెళ్లింది. మరి అన్నీ తెలిసి కూడా చంద్రబాబు మంత్రిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు..? ఎక్కువ రోజులు వెళ్లడానికి వీలు లేదని ముందే మంత్రి గంటాకు చెప్పి ఉండవచ్చు కదా? ఎందుకు చెప్పలేదు..?తీరా ఆయన విదేశాలకు వెళ్లాక ఏమీ తెలియనట్టు ఈ ఆగ్రహం దేనికో? మీడియా ముందు షో చేయడానికేనా? తాను సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాను అని అందరూ అనుకోవడానికే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వినపడుతున్నాయి.  

click me!