మంత్రిపై చంద్రబాబు అసహనం

First Published Oct 20, 2017, 6:12 PM IST
Highlights
  • మంత్రి శిద్దా రాఘవరావుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
  • జిల్లాలోనిలోని అధికారుల బదిలీ విషయంలోనూ మంత్రి ని జోక్యం చేసుకోనివ్వడంలేదు.

మంత్రి శిద్దా రాఘవరావుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనిలోని అధికారుల బదిలీ విషయంలోనూ మంత్రి ని జోక్యం చేసుకోనివ్వడంలేదు.  ఇందుకు కారణం.. చంద్రబాబు పక్కనపెట్టిన ఎమ్మెల్సీ కరణం బలరాం తో శిద్దా స్నేహం చేయడమేనని సమాచారం.

కరణం బలరాం కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేత గొట్టిపాటి రవిని టీడీపీలోకి చేర్చుకోవడం విషయంలో కరణం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబుపై నోరుపారేసుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు.. కరణానికి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. పార్టీ పదవి నుంచి కూడా తొలగించారు.

అలాంటి వ్యక్తితో మంత్రి స్నేహపూర్వకంగా మెలుగుతూ.. వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన గొట్టిపాటికి ఇబ్బంది కలిగిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. మంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. అందుకే ప్రతి విషయంలోనూ మంత్రిని  పక్కనపెట్టేస్తూ.. అవసరమైతే ఆ పనులను చంద్రబాబే స్వయంగా చక్కపెడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకు ఉదాహరణే ఇటీవల డీఎస్పీ అధికారుల నియామకం.  మంత్రి సిఫారసు చేసిన వ్యక్తిని కాదని మరీ.. చంద్రబాబు తనకు నచ్చిన వ్యక్తికి డీఎస్పీ బాధ్యతలు అప్పగించారు. ఇకనైనా కరణంతో స్నేహం మానేస్తే మంత్రి కి మంచిదని టీడీపీ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం.

click me!