సైదాపూర్ ఎస్ఐ సస్పెన్షన్

Published : Oct 20, 2017, 04:56 PM ISTUpdated : Mar 24, 2018, 12:18 PM IST
సైదాపూర్ ఎస్ఐ సస్పెన్షన్

సారాంశం

మహిళా సర్పంచ్ ని వేధించిన ఎస్ఐ ఎస్ఐ మాటలను రికార్డు చేసిన సర్పంచ్

నెల్లూరు జిల్లా సైదాపూర్ ఎస్ఐ ఏడు కొండలును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మహిళా సర్పంచిను వేధించిన కేసులో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే.. జిల్లాలోని సైదాపూర్ పోలీసు స్టేషన్లో  ఏడు కొండలు ఎస్ఐ గా పనిచేస్తున్నాడు. ఎస్ఐ కన్ను ఊటుకూరు మహిళా సర్పంచ్ పద్మజపై పడింది. దాంతో ప్రతిరోజు సర్పంచ్ కు ఫోన్ చేసి వేధించటం మొదలుపెట్టాడు. తనకు ఫోన్ చేయవద్దని సర్పంచ్ ఎంత మొత్తుకున్న ఎస్ఐ వినలేదు. అతని ఫోన్ ఎత్తకపోయేసరికి వేర్వేరు  నెంబర్లతో ఫోన్ చేసి విసిగించడం మొదలు పెట్టాడు. దాంతో ఆమె అసలు ఫోన్ ఎత్తడమే మానేసింది.

దీంతో ఏకంగా.. సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆమెపై బలత్కారం చేయబోయాడు. ఆ సమయంలో సర్పంచ్ ఇంటికి ఎవరో రావడంతో ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతకముందే ఎస్ఐ తనతో మాట్లాడిన మాటలన్నింటినీ రికార్డు చేసిన సర్పంచ్ ... అవి ఎస్పీకి అందజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్పీ.. ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !