కోనేరు ప్రదీప్ ఇంట్లో సీబీఐ సోదాలు

First Published Feb 20, 2017, 11:22 AM IST
Highlights

ఖురేషి, ప్రదీప్ చాట్ చేసుకున్న డేటాను సీబీఐ అధికారులు సేకరించినట్లు సమాచారం

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు కోనేరు రాజేంద్ర ప్రసాద్ తనయుడు ప్రదీప్ ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తోంది. హైదరాబాద్, చెన్నైలోని ఆయన కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. న్యూ ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన సీబీఐ బృందాలు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

 

ప్రతిపక్ష నేత జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు ప్రసాద్ డిశ్చార్జ్‌‌ పిటిషన్‌‌కు సాయం చేయాలంటూ ప్రదీప్ గతంలో కార్పోరేట్ లాబీయిస్ట్ మెయిన్ ఖురేషిని ఆశ్రయించినట్లు సమాచారం.

 

ఐటీ సోదాల సమయంలో ఖురేషి, ప్రదీప్ చాట్ చేసుకున్న డేటాను అధికారులు సేకరించినట్లు తెలిసింది. బొగ్గు కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరక్టర్ రంజిత్ సిన్హాకు ఖురేషితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

click me!