జీఎస్టీ కౌన్సిల్ అధికారి అరెస్టు

First Published Aug 7, 2017, 1:17 PM IST
Highlights
  • పుట్టీ పుట్టక ముందే జిఎస్టీకి లంచం మరక అంటుకుంది
  • జీఎస్టీ కౌన్సిల్ లో సూపరిండెంట్ గా చేస్తున్న ఓ అధికారి లంచం తీసుకుంటూ  సీబీఐ అధికారులకు చిక్కాడు.

పుట్టీ పుట్టక ముందే జిఎస్టీకి లంచం మరక అంటుకుంది. చాలా రాష్ట్రాలలో ఇంకా జిఎస్టీ వివాదాలు నడస్తూనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా జిఎస్టి దేశప్రజలకు అర్థం కావాల్సి ఉంది. ఇంతలోనే జిఎస్టీ కౌన్సిల్ కార్యాలయంలోనే లంచం వివాదంలో చిక్కుకుంది. నూతనంగా ఏర్పాటు చేసిన జీఎస్టీ కౌన్సిల్ లో సూపరిండెంట్ గా చేస్తున్న ఓ అధికారి లంచం తీసుకుంటూ  సీబీఐ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. మోనిష్ మల్హొత్రా అనే వ్యక్తి జీఎస్టీ కౌన్సిల్ లో సూపరిండెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన  సూచనల మేరకు  మానస్ పాట్రా అనే ట్యాక్స్ కన్సల్ టెంట్ పలువురి వద్ద నుంచి గత కొంత కాలంగా లంచం తీసుకుంటున్నాడు. అలా సేకరించిన నగదుని ఇటీవల మోనిష్ మల్హోత్రాకు అందజేస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈఘటన దేశ రాజధాని దిల్లీలో గత వారం చోటుచేసుకుంది. ఈ విభాగానికి చెందిన అధికారి సీబీఐ కి పట్టుబడటం ఇదే తొలిసారని సీబీఐ అధికారులు చెప్పారు.

click me!