హైదరాాబాద్ వైన్ షాపుల్లో ‘క్యాష్ లెస్’ జరిమానా

First Published Dec 22, 2016, 11:01 AM IST
Highlights

 హైదరాబాద్  వైన్ షాపులు  క్యాష్ లెస్  జరిమానా విధిస్తున్నాయి : ఎంఆర్ పి కంటే అధిక ధరలు ప్లస్  2 శాతం 'క్యాస్ లెస్ ' సర్వీస్ చార్జ్ 

హైదరాబాద్ లో వైన్ షాపు కల్పవృక్షం . అందులో వేస్టయ్యేదేమీ ఉండదు.  ఈ కల్పవృక్షం షాపు వాళ్లకు లాభాలు , అధికార్లకు ఆమ్యామ్యాలు, ప్రభత్వానికి రాబడి  పెంచుతుంటాయి. ఈ వ్యవహారం క్యాష్ లెస్ తో జోరందుకుంది. తెలంగాణా రాజధానిలో ఎంఆర్ పికి మందు దొరకడం అరుదు. ఎపుడు ఫుల్ బాటిల్ మీద నాలుగు నుంచి అయిదు శాతం ఎక్కువ వసూలు చేస్తారు. ఇదెపుడూ ఎక్సైజ్ శాఖ డికాయ్ కంట బడదు.

 

ఉదాహరణకు రు. 1480 ఎంఆర్ ఫి ఉండే 100 పైపర్స్ బాటిల్ ను 1550 కి తక్కువ ఏ షాపులో ఇవ్వరు. ఈ విషయాన్ని ఎక్సయిజ్ కమిషనర్ చంద్రవదన్ దృష్టి కి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన ’ మాటీం కు ఈ విషయం చెప్పాను‘ అని మాత్రం సమాధానం ఇచ్చారు.

 

ఇపుడు క్యాష్ లెస్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రో త్సాహకాలు ఇస్తుంటే హైదరాబాద్ వైన్ షాపులు జరిమాన  విధిస్తున్నాయి.  బ్యాంక్ కార్డుతో  మందుకొంటున్నారంటే సర్వీస్ చార్జ్ కింద  బిల్లుమీద రెండు శాతం వసూలు చేస్తున్నరు. అంటే 100 పైపర్ మీద క్యాష్ లెస్ పేరుతో నూరు రుపాయాలు చెలించుకోవలసి వస్తున్నది.

 

మద్యం మీద సానుకూల విధానం అవలంభించే ప్రభుత్వం నిజాయితీతో మద్యం మూల మూలలకు చేరేలా చర్యలు తీసుకోవాలి గాని, ‘అంతా  దోచుకోండి,  కొంత ఇచ్చుకోండ ’నే విధానం అనుసరించడం ఎం బాగోలేదు. (మద్యప్రియుల నోర్లు కొట్టే పాలకులకు  గడ్డురోజులు రాకమానవు )

 

మద్యం దుకాణాలో గీకుడు మొదలయిందంటే ఏమిటో అనుకున్నారంతా. తీరచూస్తే అక్కడ జరుగుతున్నది గోకుడు. గోకిగోకి దోచేసు కుంటున్నారు. వైన్ షాపు క్వార్టర్‌ సీసాను కొనుక్కోవాలంటే  కార్డును గీకాల్సిందే! ఎంఆర్ పికి అదనంగా చె ల్లించాల్సిందే.

 

మీడియం, హై ఎండ్‌ బ్రాండ్ల మద్యానికి మాత్రం కార్డును గోకాల్సిందే.  గోకే కొద్ది డబ్బులే. అందుకే వైన్ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, క్లబ్బుల్లో గీకుడు లేదా గోకుడు యంత్రాలను ఏర్పాటు చేయించేందుకు  ఎక్సైజ్‌ శాఖ ఉత్సాహంగ ఉల్లాసంగా ఉరకలేస్తున్నారు. షాపులు కూడా సై అంటే సై అంటున్నాయి.

 

ఈ ప్రక్రియ మొత్తం జనవరి నెలాఖరుకు పూర్తయ్యే అవకాశముందని ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆర్వీ చంద్రవదన్ చెబుతున్నారు.

 

జనవరి నెలాఖరు నుంచి నగదు రహిత మద్యం అమ్మకాలు పెరగొచ్చని కమిషనర్‌ తెలిపారు. అపుడు లాభాలే లాభాలు.

 

click me!