బెజవాడ నగల కార్ఖానాపై  దాడి,7 కిలోల నగల అపహరణ

First Published Jul 12, 2017, 11:07 AM IST
Highlights

విజయవాడలో బంగారు నగలు తయారుచేసే కార్ఖానాలోకి కొంతమంది దుండగులు  తుపాకులు, కత్తులతో చొరబడి సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు.గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఈ దొంగతనం జరిగింది.

 

విజయవాడలో బంగారు నగలు తయారుచేసే కార్ఖానాలోకి కొంతమంది దుండగులు  తుపాకులు, కత్తులతో చొరబడిన సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు.

నగరంలోని గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఈ దొంగతనం జరిగింది. బెంగాల్‌కు చెందిన శంకర్‌ మన్నా గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలోని ఒక భవనంలో అంతస్తులో బంగారు నగలు తయారుచేసే కార్ఖానానడుపుతున్నారు. ఇందులో 30 మంది పనిచేస్తుంటారు. మంగళవారం రాత్రి పది గంటలపుడు నగలు తయారుచేస్తుండగా 10 నుంచి 12 మంది దుండగులు తుపాకులు, కత్తులతో లోనికి ప్రవేశించి,అక్కడ పనిచేస్తున్న కార్మికులను ఒకచోటకు చేర్చి ఏడు కిలోల నగలను బ్యాగులోకి సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కార్ఖానా యజమాని సోదరుడు సుభాష్‌ మన్నా, మరో వర్కరు తేరుకుని వారిని వెంబడించారు. దుండగులు దొరకలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click me!