యూనిఫాం రద్దు చేయాలని.. అమ్మాయిల డ్రస్లు వేసుకున్నారు..!

First Published Aug 24, 2017, 4:56 PM IST
Highlights
  • అమ్మాయిలు దుస్తులు వేసుకొని నిరసన తెలిపారు
  • వీరి ఆందోళన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతోంది.

 

విద్యార్థులందరూ యూనిఫాం ధరించాలని స్కూల్లో నియమం పెట్టడం సర్వసాధారణం. చాలా మంది పిల్లలకు రోజూ యూనిఫాం వేసుకోవడం నచ్చదు.. కానీ తప్పక వేసుకుంటూ ఉంటారు. కానీ ఇద్దరు అబ్బాయిలు మాత్రం అలా ఊరుకోలేదు. వినూత్నంగా ఉద్యమం చేపట్టారు. అమ్మాయిలు దుస్తులు వేసుకొని నిరసన తెలిపారు.

వివరాల్లోకి వెళితే... కాలిఫోర్నియాలోని  ఓ పాఠశాలలో విద్యార్థులు కచ్చితంగా యూనిఫాం ధరించాలనే నియమం ఉంది. అంతేకాకుండా అమ్మాయిలు .. ఆఫ్ షోల్డర్స్ టాప్స్..( భుజాలు కనిపించే టాప్) వేసుకోకూడదనే నియమం కూడా ఉంది. ఇప్పటి వరకు ఆ నియమాన్ని విద్యార్థులు ఫాలో అవుతూ వస్తున్నారు.

ఆగస్టు 14 నుంచి అక్కడ పాఠశాలలు తెరచుకున్నాయి. అప్పటి నుంచి ఇద్దరు బాలురు యూనిఫాం వద్దంటూ ఆందోళన చేపట్టారు.

అమ్మాయిలు ధరించే ఆఫ్  షోల్డర్స్ టాప్స్ వేసుకొని నిరసన మొదలుపెట్టారు.  వారికి మరో 50 మంది అమ్మాయిలు మద్దతు తెలుపుతూ వారితో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి ఉద్యమానికి సోషల్ మీడియాలో మద్దతు బాగా వస్తోంది.

ఆ పాఠశాలలో అమ్మాయిలు.. అలాంటి డ్రస్లు వేసుకొని ఫోటోలు దిగడం కూడా విరుద్దమే. ఈ నియమాలను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతోంది.

click me!