చిటికెడు ‘ఉప్పు’ కి బిల్లు వేసిన రెస్టారెంట్..!

Published : Aug 24, 2017, 04:03 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చిటికెడు ‘ఉప్పు’ కి బిల్లు వేసిన రెస్టారెంట్..!

సారాంశం

చిటికెడు ఉప్పు తీసుకున్నందుకు బిల్లు వేశారు ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది

 

 

రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేస్తే.. మనం తిన్న దానికి బిల్లు వేస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. చిటికెడు ఉప్పుకి కూడా బిల్లు వేస్తారని మీకు తెలుసా. నిజంగనే ఓ రెస్టారెంట్ లో చిటికెడు ఉప్పు తీసుకున్నందుకు బిల్లు వేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నగరానికి చెందిన ఓ వ్యక్తి.. కుటుంబంతో కలిసి సోమాజీగూడ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లాడు. అతను లెమన్ సోడా ఆర్డర్ చేశాడు. సిబ్బంది దానిని అతనికి అందజేయగా.. కొద్దిగా ఉప్పు తక్కువైందని.. ఇవ్వమని కోరాడు. హోటల్ సిబ్బంది కూడా ఇచ్చారు. అయితే.. భోజనం అయిపోయిన తరువాత ఇచ్చిన బిల్లులో ఉప్పుని కూడా చేర్చారు. వారు తిన్న భోజనంతో పాటు అదనంగా ఉప్పుకి రూ.1 చేర్చారు. దీంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది.

 కాగా.. రెస్టారెంట్ యజమాని మాత్రం ఈ ఘటన కావాలని చేసింది కాదని పొరపాటుగా జరిగిందని తెలిపారు.  కొత్త  సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేశామని.. దీనిపై అందరికీ అవగాహన లేకపోవడంతో పొరపాటు జరిగిందని చెప్పారు. తమ వల్ల జరిగిన పొరపాటుకు.. కస్టమర్ తీసుకున్న లైమ్ సోడాకు బిల్లు రూ.150  క్యాన్సిల్ చేస్తామని రెస్టారెంట్ యాజమాన్యం ఆఫర్ ఇవ్వగా .. కస్టమర్ తోసిపుచ్చారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !