
ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ బ్లాక్ బెర్రీ భారత మార్కెట్ లోకి ఓ నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఇప్పటికే భారత్ లో 10లక్షల మందికి పైగా బ్లాక్ బెర్రీర వనియోగదారులు ఉన్నారు. కాగా ఇప్పుడు కీవన్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.39,990గా తెలిపారు. ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రముఖ ఈ- కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో ఈ ఫోన్లు లభ్యం కానున్నట్లు వారు చెప్పారు.
భారత్ తమకు ఎంతో ముఖ్యమైన మార్కెట్ అని .. భారతీయులతో మా బ్రాండ్ ఇప్పటికీ దృఢమైన బంధాన్ని కలిగి ఉందని.. బ్లాక్ బెర్రీ కంపెనీ తెలిపింది.
బ్లాక్ బెర్రీ కీవన్ ఫీచర్లు
* క్వర్టీ కీ ప్యాడ్ కాకుండా 4.5 అంగుళాల తాకే తెర
* ఆండ్రాయిడ్ నోగట్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్
* 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* 64 జీబీ అంతర్గత మెమొరీ
* 4జీ వీవోఎల్‌టీఈ
* 3505 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం