సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం (వీడియో)

Published : May 17, 2018, 09:38 AM ISTUpdated : May 17, 2018, 09:54 AM IST
సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం (వీడియో)

సారాంశం

ఉదయం సరిగ్గా 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 

కర్ణాటక 23వ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో యడ్యూరప్పతో గవర్నర్ వజుభాయ్‌వాలా ప్రమాణస్వీకారం చేయించారు.  కర్ణాటక సీఎంగా మూడోసారి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. బలనిరూపణ తర్వాతే కేబినెట్‌ను విస్తరణ జరుగనుంది. 15రోజుల్లో యడ్యూరప్ప సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనుంది. ప్రమాణస్వీకారమహోత్సవంలో పెద్దఎత్తున కార్యకర్తలు, జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి హైడ్రామా తరువాత యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. గవర్నర్ నిర్ణయాధికారంలో జోక్యం చేసుకోబోమని కోర్టు తేల్చిచెప్పింది. దాంతో  ఉదయం సరిగ్గా 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !