
నేరెళ్ల ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర మావన హక్కుల సంఘం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను ఆదేశించింది. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన 8మంది నిర్భందించి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మానవ హక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించింది.
అసలు ఏం జరిగిందంటే.. నెరెళ్ల వద్ద లారీలు అత్యంత వేగంతో ప్రయాణాస్తున్నాయని.. దీంతో తమ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని గ్రామస్థులు కొంత కాలంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దానికి పోలీసులు స్పందించలేదు. ఇలాగో గత కొద్ది రోజుల క్రితం నేరెళ్లలో ఇసుక లారీ ఢీకొని ఎస్టీ కులానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు రెండు లారీలకు నిప్పు పెట్టారు. లారీ యజమానులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు 8మందిని నిర్భందించి.. చిత్ర హింసలకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది.
ఎస్సీ, బీసీ కులానికి చెందిన వారిని హింసించారు అని వచ్చిన ఆరోపణలపై పోలీసులు స్పందించకపోవడాన్ని మానవ హక్కుల కమీషన్ తప్పు పట్టింది. ఇసుక లారీలు ప్రమాదకరమైన వేగంతో నడుస్తున్నాయని.. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్థులు చేసిన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కమిషన్ ప్రశ్నించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా కమిషన్ డీజీపీ అనురాగ్ శర్మను కోరింది.
ఈ ఘటనపై మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో దళితులు, బడుగు బలహీనవర్గాలపై జరిగిన దాడులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. సిరిసిల్ల ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.