రోడ్డు పేరు మహాత్ముడిది.. రోడ్డెక్కితే చేసేది ఇదీ...

Published : Jan 03, 2017, 10:11 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
రోడ్డు పేరు మహాత్ముడిది.. రోడ్డెక్కితే చేసేది ఇదీ...

సారాంశం

అమెరికా అధ్యక్షుడు ఒబామాకు  బెంగుళూరు అంటే మహాగౌరవం ... వాళ్లను చూసి నేర్చుకోండి అంటూ అమెరికన్లకు ఓ సారి ఉద్భోవించాడు కూడా.  ఈ సిటీ ఘనతపై బెంగుళూరింగ్ అనే కొత్త ప్రయోగం కూడా పుట్టుకొచ్చింది. ఈ ఘటన తర్వాత బెంగుళూరింగ్  కు అర్ధం మార్చేసే పరిస్థితి దాపురించింది.

 

అమెరికా  అధ్యక్షుడికి బెంగుళూరు అంటే మహాగౌరవం ... వాళ్లను చూసి నేర్చుకోండి అంటూ అమెరికన్లకు ఓ సారి ఉద్భోవించాడు కూడా. ఈ సిటీ ఘనతపై బెంగుళూరింగ్ అనే కొత్త ప్రయోగం కూడా పుట్టుకొచ్చింది. 

 

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న ఈ గొప్ప నగరం పేరు న్యూ ఇయర్ రోజున ప్రపంచమంతా మారిమోగిపోయింది. ముఖ్యంగా మహాత్ముడి పేరు పెట్టుకున్న రోడ్డు ( ఎంజీ రోడ్డు) అయితే మరీను.

 

డిసెంబర్ 31 శనివారం అర్ధరాత్రి మహిళలపై ఎంజీ రోడ్డు లో జరిగిన ఆరాచక పర్వం దేశానికి మాయని మచ్చగా మిగలిపోతుంది. నిర్భయ ఘటన కంటే ఇది నూరింతలు ఎక్కువ అనడంలో ఏలాంటి సందేహం లేదు.

 

ఈసారి మాత్రమే కాదు గత ఏడాది కూడా అక్కడ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయట. కొందరు మహిళలు దీనిపై ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడం, సీసీటీవీ దృశ్యాలు కూడా దొరకకపోవడంతో కేసు ముందుకు సాగలేదు. 

ఈసారి ముందస్తు చర్యగా 1500 మంది పోలీసులను ఎంజీ రోడ్డు లో భద్రత కోసం మొహరించారు. అయినా అవే ఘటనలు పునరావృతమమయ్యాయి.

 

ఎక్కడో మారుమూల పల్లెళ్లో కాకుండా దేశంలోని మేధో యువత అంతా పనిచేసే నగరంలో ఇంత దారుణం చోటుచేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

 

 

ఈ అరాచకానికి పాల్పడిన అక్కడి యువత తీరు కంటే మన నేతలు ఈ ఘటనపై స్పందించిన విధానంపై నే ఇప్పుడు దేశ ప్రజలు షాక్ అవుతున్నారు.

 

‘పొట్టి దుస్తులు వేసుకొని అర్ధరాత్రి రోడ్డు ఎక్కితే అలానే జరుగుతుంది. క్రిస్మస్ కు, న్యూ ఇయర్ కి ఇదంతా కామన్ అని చాలా తేలిగ్గా చెప్పాడు కర్నాటక హోం మంత్రి పరమేశ్వరన్.

 

ఇక సమాజ్ వాది పార్టీ నేత , ఎమ్మెల్యే అబూ ఆజ్మీ అయితే బాధిత మహిళలనే నిందించడం మొదలు పెట్టారు. అబ్బాయిలు, అమ్మాయిలు అలా కలిసి తిరగడం తప్పు.  

 

ఈ కాలంలో మహిళలు ఎంత తక్కువ దుస్తులు ధరిస్తే అంత ఫ్యాషన్‌, ఆధునికురాలు, విద్యావంతురాలిగా భావిస్తున్నారు. ఇటువంటి ధోరణి బాగా పెరిగిపోయింది. మన సంస్కృతికి ఇది మచ్చగా మారింది’’ అని వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !