జేబులు చూసుకోండి.. రేపటి నుంచి బ్యాంకులు బంద్

First Published Mar 10, 2017, 1:18 PM IST
Highlights
  • మార్చి 11 నుంచి మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు

బ్యాంకు వినియోగదారులకు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ ఓ విలువైన సూచన చేసింది. వివిధ బ్యాంకులు పెడుతున్న తలతిక్క షరతుల గురించి కాదులేండి. దేశంలోని బ్యాంకులన్నింటికీ వరసుగా మూడు రోజులు సెలవులున్నాయట. కాబట్టి వనియోగదారులందరూ ఈ మూడు రోజులు బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండా తమ పనులు చేసుకోవాలని సూచించింది.

 

శని, ఆది, సోమ వారాల్లో బ్యాంకులకు సెలవు కాబట్టి దానికి అనుగుణంగా మీ వ్యాపారలావాదేవీలు పూర్తి చేసుకోవాలని దేశ ప్రజలను కోరింది.

 

11న రెండో శనివారం, 12న ఆదివారం, 13వ తేదీ హోలీ పండుగ సెలవులు ఉన్నందున వినియోగదారులు సహకరించాలని ఒక ప్రకటనలో వెల్లడించింది.


పెద్ద నోట్ల రద్దు, ఇటీవల కొన్ని బ్యాంకులు తీసుకొస్తున్న షరతులతో ఇప్పటికే సతమతమవుతోన్న ప్రజలకు ఈ సెలవుల బాధ మరంత చికాకు తెప్పిస్తోంది.

ఇప్పటికే ఏ ఏటీఎంలలో సరిపడా క్యాష్ కనిపించడం లేదు. చాలా ఏటీఎంలు నో క్యాష్ బోర్డుతో దర్శనమిస్తున్నాయి.

 

ఇలాంటి సమయంలో బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుందామనుకున్న వినియోగదారులకు ఈ సెలవుల ప్రకటన మరింత ఇబ్బంది  పెట్టే అవకాశం కనిపిస్తోంది.

click me!