ముద్దు మీది... భద్రత మాది

Published : Mar 10, 2017, 10:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ముద్దు మీది... భద్రత మాది

సారాంశం

మండు వేసవిలో ముద్దుల ఉద్యమంతో కేరళ హాటెక్కిపోతోంది. పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోండి మేం సెక్యూరిటీగా ఉంటామని అక్కడి కొందరు ఉద్యమకారులు ప్రేమ జంటలకు అభయమిస్తున్నారు. కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్టు పేరుతో ఉద్యమిస్తున్నారు.    

మోరల్ పోలీసింగ్ పేరుతో ఇటీవల కేరళలో శివసేన కార్యర్తలు హల్ చల్ చేశారు. పబ్లిక్ పార్కుల్లో ఉన్న జంటలను పట్టుకొని చితగ్గొట్టారు. దీంతో  అక్కడ కొందరు ఉద్యమకారులు కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్ పేరుతో ఓ ముద్దు ఉద్యమాన్ని లేవదీశారు.

 

పబ్లిక్ గా జంటలు ముద్దులు పెట్టుకోవచ్చు. మీకు మీం సెక్యూరిటీ ఇస్తాం అని భరోసా ఇస్తున్నారు. మోరల్ పోలీసింగ్ పేరుతో హిందూ అతివాద సంస్థలు చేసే దాడులను చాలెంజ్ చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. 

 

ఇటీవల శివసేన కు చెందిన కార్యకర్తలు కేరళలో పబ్లిక్ పార్కుల్లో తిరుగుతున్న జంటలను పట్టుకొని దాడులకు దిగడం వివాదంగా మారింది.

 

కమ్యూనిస్టులు కూడా ఈ ఘటనలపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మోరల్ పోలీసింగ్ తో చేసే దాడులను సహించేదే లేదని స్పష్టం చేశారు. అయితే కొందరు ఉద్యమకారులు తీసకొచ్చిన కిస్ ఆఫ్ అవ్ ప్రొటెస్టును మాత్రం వ్యతిరేకించారు.

 

కిస్ ఆఫ్ లవ్ ను మీ ఇంట్లో ఒప్పుకుంటార్ లేదో ముందు ఆలోచించుకోవాలని యువతకు కేరళ కమ్యూనిస్టు నేత బాలకృష్ణన్ సూచించారు.

 

శివసేన మోరల్ పోలిసింగ్ ను తాము వ్యతిరేకిస్తున్నామని అయితే దానికి నిరసగా చేస్తున్న కిస్ ఆఫ్ లవ్ ఉద్యమం కూడా సరికాదని పేర్కొన్నారు.

 

 

కాగా, కేరళలో కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్టు 2014 లోనే మొదలు పెట్టారు. అప్పుడు కూడా సీపీఐం నేతలు దీన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. దీనికి బదులుగా కమ్యూనిస్టు నేతలు లవ్  సిట్ ఇన్ అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ, ఇది పెద్దగా విజయవంత కాలేదు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !