ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం

First Published Aug 30, 2017, 2:00 PM IST
Highlights
  • ఆస్ట్రేలియాపై బంగ్లా చరిత్ర సృష్టించింది.
  • మొదటి టెస్టులో 20 పరుగుల తేడాతో విజయం
  • బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన షకిబుల్ అల్ హాసన్

ప‌సికూన‌ బంగ్లా, ఆస్ట్రేలియాను ఓడించి చ‌రిత్ర సృష్టించింది. అది కూడా టీ20, వ‌న్డేలో కాదు ఏకంగా టెస్టులోనే ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 101 టెస్టు మ్యాచులు ఆడిన బంగ్లా కేవ‌లం 10 మ్యాచ్ లు మాత్ర‌మే గెలిచింది. అందులో బంగ్లాదేశ్ కి చిర‌కాల విజ‌యం అంటే ఆస్ట్రేలియా పైనే అయింద‌న‌డంలో సందేహాం..


మీర్పూర్ లో ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ మ‌ధ్య మొద‌టి టెస్టు జ‌రిగింది. 20 ప‌రుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. బంగ్లాదేశ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది, ష‌కిబ్ అల్ హ‌స‌న్ 84 ప‌రుగులు చేశాడు. బంగ్లా మొద‌టి ఇన్నింగ్స్ లో 260 ప‌రుగుల‌కు అలౌట్ అయింది. త‌రువాత ష‌కిబ్ అల్ హాస‌న్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌కు చుక్క‌లు చూపించాడు, ప‌దునైన బంతుల‌తో ఐదు వికెట్లు తీసి 244 ప‌రుగుల‌కే ఆలౌట్ చేశాడు. 

రెండ‌వ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా, ఆసీస్ బౌల‌ర్‌ ఎన్ఎమ్ లియ‌న్ దాటికి 221 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ త‌మీన్ ఇక్బాల్‌ 78 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. 264 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ ని ష‌కిబుల్ మ‌రో సారి న‌డ్డివిరిచాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన ష‌కిబుల్ మ‌రోసారి 5 వికెట్లు తీశాడు. అద్బుత‌మైన‌ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ తో రాణించిన ష‌కిబ్ అల్ హస‌న్ కి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ వచ్చింది.  

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి 

 

click me!