రియాలిటీ షో న్యాయనిర్ణేతలుగా బాబా రామ్ దేవ్, సోనాక్షి

Published : Aug 02, 2017, 04:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రియాలిటీ షో న్యాయనిర్ణేతలుగా బాబా రామ్ దేవ్, సోనాక్షి

సారాంశం

‘ఓమ్ శాంతి ఓమ్’ పేరిట ఈ టీవీ రియాల్టీ షో ఓ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి

 

యోగా గురు బాబా రామ్ దేవ్ ఓ రియాల్టీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఆయనతోపాటు బాలీవుడ్ నటి సోనాక్షి  సిన్హా కూడా జడ్జిమెంట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో త్వరలో ప్రారంభం కానుంది. ‘ఓమ్ శాంతి ఓమ్’ పేరిట ఈ టీవీ రియాల్టీ షో సాగనుంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించి ఓ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ ఏపిసోడ్ కి బాబా రామ్ దేవ్, సోనాక్షిలతో పాటు  బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కూడా హాజరయ్యారు.

ఈ షోలో పోటీదారులు భక్తి గేయాలను ఆలపిస్తారని సమాచారం. రామ్ దేవ్ గతంలో నచ్ బలియే అనే డ్యాన్స్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన పోటీదారులను యోగాసనాలు కూడా నేర్పించారు.  కాగా.. ఆయన న్యాయనిర్ణేతగా ఓ రియాల్టీ షో కార్యక్రమానికి వ్యవహరించడం మాత్రం తొలిసారి. మరి ఈ సారి కూడా యోగాసనాలు నేర్పిస్తారేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !