అయ్యన్న పాత్రుడి బతుకు ఇలా ధన్యమయింది

Published : May 07, 2017, 05:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
అయ్యన్న పాత్రుడి బతుకు ఇలా ధన్యమయింది

సారాంశం

మూడు తరాల పాటు ఒకేకుటుంబానికి చెందిననాయకులకు సేవ చేసే భాగ్యం దొరికినందుకు మంత్రి అయ్యన్న పాత్రుడి బతుకు ధన్యమయిందట.

 

మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి బతుకు ధన్యమయింది. ఎలాగో తెలుసా?

 

మూడు తరాల పాటు ఒకేకుటుంబానికి చెందిననాయకులకు సేవ చేసే భాగ్యం దొరికినందుకు.

 

ఎవరా మూడు తరాల నాయకులు?

 

తెలుగుదేశం సంస్థాపకుడు ఎన్టీ రామారావు, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు, ఈయన కుమారుడు నారా లోకేశ్ బాబు.

 

తనకు  కలిగిన ఈ మహద్భాగ్యం గురించి చింతకాయల అయ్యన్న పాత్రుడు నిన్నస్వయంగా వేలాది మంది కార్యకర్తలు ముందు చెప్పారు. విశాఖ పట్ణంలో ఆరు కోట్ల రుపాయలతో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాయలన్ని లోకేశ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్న పాత్రడి తన జీవిత సాఫల్యం రహస్యాన్ని టిడిపి కార్యకర్తలందిరితో పంచుకున్నారు.

 

‘విశాఖలో సెంట్రల్‌ ఆఫీస్‌ నిర్మించాలన్న 20 ఏళ్ల కల నెరవేరింది. ఎన్‌టీఆర్‌తో రాజకీయ జీవితం ప్రారంభించాను.నాకు ఇపుడు   చంద్రబాబుతోపాటు అతని కుమారుడు, మూడో తరంనేత లోకేశ్‌తో పనిచేసే అవకాశం దక్కింది. నా జీవితం ధన్యమైంది,’ అన్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !