హిందువుని పెళ్లి చేసుకుంటావా.. నీ అంతు చూస్తాం..

Published : Jul 29, 2017, 12:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
హిందువుని పెళ్లి చేసుకుంటావా.. నీ అంతు చూస్తాం..

సారాంశం

2009లో ఫర్హాన్‌ను వివాహం చేసుకున్నఆయేషా సూపర్ చిత్రంతో తెలుగులో గుర్తింపు

బాలీవుడ్ నటి ఆయేషా టకియా భర్త ఫర్హాన్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈనెల మొదటి వారంలో ఆయనకు ఓ హిందుత్వ పార్టీ నుంచి ఫోన్ వచ్చిందని.. ‘ముస్లిం మతానికి చెందని నీవు హిందూ మతానికి చెందని యువతిని పెళ్లి చేసుకుంటావా.. నీ అంతు చూస్తామని’ బెదిరించినట్లు ఫర్హాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన జులై 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయేషా టకియా..ఢర్, దిల్ మాంగే మోర్ వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు తెలుగులో నాగార్జున సరసన సూపర్ చిత్రంలో నటించారు. ఆమె 2009లో ఫర్హాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడు మైకెల్ అనే ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

కాగా.. ఫర్హాన్‌.. సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీ కుమారుడు.  కాగా..‘మీ నాన్నని వూరికే నోరుపారేసుకోవద్దని చెప్పు. లేకపోతే ఆయన్నిచంపేస్తాం... అయినా  ముస్లిం మతానికి చెందిన వాడివి అయ్యి ఉండి హిందూ యువతిని అందులోనూ బాలీవుడ్‌ నటిని పెళ్లిచేసుకుంటావా.. నీ అంతుచూస్తామని’ వారు బెదిరించినట్లు ఫర్హాన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !