జాతియ జెండా రూపకల్పి పింగళి జయంతి రేపు

First Published Aug 1, 2017, 6:15 PM IST
Highlights
  • పింగళి దేశానికి ముద్దు బిడ్డ
  • నివాళులర్పించిన చంద్రబాబు

మన దేశానికి పింగళి వెంకయ్య ముద్దు బిడ్డ అని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆగస్టు 2వ తేదీ జాతీయ జెండా రూపకల్పి పింగళ వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రెపరెపలాడే జాతీయ జెండాను చూడగానే పింగళి గుర్తుకు వస్తారన్నారు.1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో పింగళి వెంకయ్య జన్మించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే కాక, దేశానికే ముద్దుబిడ్డ అని, తుది శ్వాసదాకా విలువలకు నిబద్ధుడై, నిజాయతీగా జీవించారని చంద్రబాబు కొనియాడారు.

  19 ఏళ్లకే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారని, ఆఫ్రికాలో జరిగిన ఆంగ్లో-బోయర్ (Alglo Boer) యుద్ధంలో పాల్గొన్నారని చెప్పారు. పింగళి వెంకయ్యకు ఆనాడు  మహాత్మునితో ఏర్పడిన పరిచయం ఐదు దశాబ్దాల పాటు  కొనసాగిందని అన్నారు. 

  30 దేశాల జాతీయ పతాకాలను పరిశీలించి మన దేశ జాతీయపతాకాన్ని తయారు చేశారన్నారు. ఆయన వ్యవసాయం, భూభౌతిక శాస్త్రం మీద ఎంతో ఆపేక్ష కనపరిచారని, జపనీస్ సహా అనేక విదేశీ భాషల్లో ప్రవేశం ఉందన్నారు.

click me!