
దేశ ప్రజలందరికీ ఇది నిజంగా శుభవార్తే. ఇక పై ఏటీఎంల దగ్గర గంటల తరబగి క్యూలో నిలబడే దుస్థితి తప్పనుంది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా పరిమితిని రూ.2500 కు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కష్టాలు త్వరలో తీరబోతున్నాయి.
విత్ డ్రా పరిమితిని రద్దు చేయనున్నట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు.
డిసెంబర్ 30 తర్వాత ఏటీఎంల్లో లావాదేవీలపై విధించిన పరిమితిని ఎత్తివేస్తామని వెల్లడించారు.
కొత్త నోట్లు భారీగా బ్యాంకులకు చేరాయిని, జనవరి లోపు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంటుందని పేర్కొన్నారు.