హైటెక్ సిటికి ధీటుగా ఎపిలో ఐటి కారిడార్

First Published Dec 23, 2017, 3:16 PM IST
Highlights

ఆంధ్ర రావడానికి క్యూ కడుతున్న ఐటి , ఎలెక్ట్రానిక్ కంపెనీలు

హైదరాబాద్ అంటే  హైటెక్ సిటి అన్నట్లే ఆంధ్రలో హైటెక్ కారిడార్ ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  ఈ  విషయాన్ని ఐటి మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.  ఈ రోజు అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఐటీ మంత్రి లోకేష్ రాష్టంలో ఐటి కారిడార్ ఏర్పాటుచేేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఎలక్ట్రానిక్ పరిశ్రమల్ని పెద్దఎత్తున ఆకర్షిస్తున్నామని,  చాలా కంపెనీలు ఆంధ్ర వైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు.  సిలికాన్ కారిడార్ పేరుతో ఎలక్ట్రానిక్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూ రానున్న భాగస్వామ్య సదస్సులో ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో పెద్దఎత్తున ఎంవోయూలు చేసుకోబోతున్నామని లోకేశ్ చెప్పారు. 
ఇటీవల తన అమెరికా పర్యటనలో గూగుల్ ఎక్స్‌తో ఎంవోయూ చేసుకున్నవిషయం గుర్తు చేస్తూ  తిరుపతిలో సాఫ్ట్‌వేర్ కంపెనీ జోహో జనవరిలో ప్రారంభమతున్నదని కూడా ఆయన వెల్లడించారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌తో సంప్రదింపులు పూర్తిచేశామని కూడా లోకేశ్ చెప్పారు. విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించేందుకు వారు అంగీకరించారని కూడా అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫ్లె క్స్‌ట్రానిక్స్ కూడా ఆంధ్ర కు వస్తున్నదని ఆయన ప్రకటించారు. ఈ కంపెనీల ఇప్పటికే తమిళనాడులో కార్యకలాపాలు సాగిస్తున్నా  ఏపీ రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి చెప్పారు.

click me!