‘దేశం’ ఆనందం ఆవిరైపోయింది

Published : Oct 21, 2017, 11:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
‘దేశం’ ఆనందం ఆవిరైపోయింది

సారాంశం

కర్నూలు వైసీపీ ఎంపి బుట్టా రేణుక ఫిరాయించిన ఆనందం ఒక్క రోజు కూడా మిగలలేదు. దీపావళి పండుగను కూడా టిడిపి నేతలు సరిగ్గా జరుపుకున్నారో లేదో అనుమానమే. అదంతా టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పుణ్యమే.

తెలుగుదేశంపార్టీ ఆనందం కాస్త  24 గంటల్లో ఆవిరైపోయింది. కర్నూలు వైసీపీ ఎంపి బుట్టా రేణుక ఫిరాయించిన ఆనందం ఒక్క రోజు కూడా మిగలలేదు. దీపావళి పండుగను కూడా టిడిపి నేతలు సరిగ్గా జరుపుకున్నారో లేదో అనుమానమే. ఆఖరికి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన విశేషాల గురించి కూడా చెప్పటానికి మంత్రులు మీడియా సమావేశం పెట్టటానికి కూడా జంకుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకు అంత ఇబ్బంది ? అదంతా టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పుణ్యమే.

మామూలుగా ఏ టపాసుకైనా ఒత్తి వెలిగిస్తే మహా అయితే  ఒక నిముషంలో పేలిపోతుంది. రాకెట్ లాంటివైతే గాల్లోకి లేచి ఎక్కడో పడుతుంది. కానీ అదేంటో, దీపావళి ముందు  పేలిన ‘రేవంత్ బాంబు’ మాత్రం మూడు రోజులైనా టిడిపి నేతల గుండెల్లో ఇంకా మోత మోగిస్తూనే ఉంది. బాంబు పేలిన ప్రకంపనలు  ఏ స్ధాయిలో ఉందంటే ఏపిలోని టిడిపి నేతలైతే బహిరంగంగా రేవంత్ పేరెత్తాలంటేనే భయపడిపోతున్నారు.

మామూలుగా అయితే, ఫిరాయింపు నేతలతో టిడిపి వరుసబెట్టి మీడియా సమావేశాలు పెట్టిస్తుంది వైసీపీ అధినేతను తిట్టించటానికి. ఫిరాయింపులు కూడా ఉత్సాహంగానే జగన్ ను తిడుతుంటారు. ఎందుకంటే, చంద్రబాబునాయుడు మెప్పు కోసం. ఇప్పటి వరకూ టిడిపి చేసిందదే. కానీ బుట్టా రేణుక అలా టిడిపిలోకి ఫిరాయించారో లేదో మరుసటి రోజే రేవంత్ బాంబు పేల్చారు. దాంతో బుట్టాను ఎవరూ పట్టించుకోవటం లేదు. మరి కొద్ది రోజుల పాటు టిడిపికి బహుశా వైసీపీ గురించి పట్టించుకునే తీరికుండదేమో?

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !