
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రాజకీయ జీవితంలో ఒక అరుదైన సంఘటన జనవరి8 తేదీన జరుగనుంది. ఆయన జనవరి 8 శ్రీ లంక ప్రభుత్వం రెండో వార్షికోత్సవానికి హాజరవుతున్నారు.
సాధారణంగా ఇలాంటి అవకాశం దేశాధినేతలకు లేదా బాగా పేరున్న ఆర్థిక వేత్తలకు దొరుకుతూ ఉంటుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అరుదు. బహుశా ఇండియాలో ఏ ముఖ్యమంత్రికి ఇదొరికి ఉండదు.
ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తాను చేపట్టిన కార్యక్రమాల గురించి శ్రీలంక ప్రజలకు వివరించనున్నారు.
ఆరోజున శ్రీ లంక నేషనల్ యూనిటీ గవర్నెమెంట్ రెండవ వార్షికోత్సవానికి గౌరవ అతిధి హాజరుకావాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
శ్రీలంక ప్రభుత్వం 2017లో ఒక దారిద్య్ర నిర్మూలన పథకం చేపట్టాలనుకుంటున్నదట. ఈ సందర్భంగా ‘ అభివృధ్దిలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ల’ పాత్ర గురించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఇందులో అందరికీ సంపద అనే లక్ష్యం సాధించడం గురించి శ్రీ లంక ప్రజలతో ఆయన తన అనుభవాలు పంచుకుంటారు.
సిరిసేన 2015 ఎన్నికలలో మహింద రాజపక్షను ఓడించి అధికారంలోకి వచ్చారు. నిజానికి ఆయన మహింద ను వదలేసి ప్రతిపక్షం సంకీర్ణంలోకి వచ్చారు. అధ్యక్ష పదవి అభ్యర్థి అయ్యారు. గెలిచాక నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటుచేశారు.
నేషనల్ యూనిటీ గవర్నమెంట్ మొదటి వార్షికోత్సవానికి (2016) గౌరవ అతిధిగా మాజీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని ఆహ్వానించారు. ఇపుడు ఈ గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కింది.
ఈ ముఖ్యమంత్రి శ్రీలంక తో సంబంధాలు పెట్టుకోవాలని ఆశిస్తున్నారు. 2016 జూన్ లో చైనా వెళ్లినపుడు తియాంజిన్ పట్ణణంలో ఆయన శ్రీలంక ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ మంత్రి మలిక్ సమర విక్రమను కలుసుకున్నారు. రెండుదేశాలు సహకరించుకోవడం గురించి మాట్లాడుకున్నారు.
ఈ పర్యటనతో చంద్రబాబు నాయుడి అభిమానులు చైనా కొరియా, జపాన్, మలేషియా, సింగపూర్ నుంచి శ్రీ లంక దాకా విస్తరించి ఉన్నట్లు అర్థమవుతుంది.