‘నదుల’ మీద జోక్స్ వేసి ‘ఫేస్’బుకయ్యాడు..

First Published Oct 16, 2017, 5:18 PM IST
Highlights
  • సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడు
  • సెక్షన్ 420 కింద యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
  • 42రోజుల పాటు వందలాది ఖైదీల మధ్య గడిపిన యువకుడు

ప్రభుత్వం మీద, నదుల మీద సోషల్ మీడియా వేదికగా జోక్స్ వేసినందుకు ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజద్రోహం, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణల కింద అతనిని అరెస్టు చేసిన పోలీసులు 42 రోజుల తర్వాత విడుదల చేశారు.

వివరాల్లోకి వెళితే..జాకీర్ అలీ త్యాగీ అనే 18ఏళ్ల కుర్రాడు.. ముజఫర్ నగర్ లోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ.. కరస్పాండెన్స్ లో బీఏ చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం.. జాకీర్.. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశాడు. రామ మందిరం కట్టిస్తామని బీజేపీ ఇచ్చిన ప్రామిస్ ఏమైందని, ఎయిర్ ఇండియాతో చేసుకున్న హజ్ సబ్సీడీనీ ఎందుకు విత్ డ్రా చేసుకోలేదని జాకీర్ కామెంట్ చేశాడు. రామ మందిర నిర్మాణం ఎన్నికల జిమ్మిక్కుల కోసం వాడుకుంటారని, ముస్లింలను పాకిస్థాన్ కి పంపిస్తామని హామీలు ఇస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా క్రిమినల్స్ చేతిలో చనిపోయిన ఓ పోలీసు అధికారి ఫోటోని జాకీర్.. తన ఫ్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.  

జాకీర్ చేసిన దానిని నేరంగా భావించిన పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420, సెక్షన్ 66 కింద యువకుడిని అరెస్టు చేశారు. అనంతరం అతనిని వందల మంది క్రిమినల్స్ ఉండే ముజఫర్ నగర్ జైలులో ఉంచారు. 42 రోజుల తర్వాత జాకీర్ బయటకు వచ్చాడు. అనంతరం జాకీర్ మాట్లాడుతూ... తనకు రాజకీయాలన్నా.. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. న్యూస్ పేపర్లలో వచ్చే వార్తలను చదవడం, షేర్ చేయడం తనకు అలవాటని తెలిపాడు. సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తే ఇలా జరుగుతుందని తానెప్పుడూ ఊహించలేదని పేర్కొన్నాడు.

click me!