ఏపీ అసెంబ్లీ పనిదినాల పొడిగింపు

Published : Nov 20, 2017, 05:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఏపీ అసెంబ్లీ పనిదినాల పొడిగింపు

సారాంశం

వైసీపీ అసెంబ్లీ బహిష్కరణను ప్రభుత్వం అవకాశంగా తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పనిదినాలను మరో  మూడు రోజులు పొడిగించారు.

వైసీపీ అసెంబ్లీ బహిష్కరణను ప్రభుత్వం అవకాశంగా తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పనిదినాలను మరో  మూడు రోజులు పొడిగించారు. మొదట పది రోజులపాటు సమావేశాలను జరపాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు అదనంగా మరో మూడు రోజులను పెంచారు. సోమవారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 25తోనే సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరిన్ని అంశాలపై చర్చించేందుకు వీలుగా సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సభలో ప్రతిపక్ష నేతలు లేకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లని వాళ్లే పొగుడుకుంటూ.. వాళ్ల జబ్బలను వాళ్లే చరుచుకుంటున్నారు. కాగా.. మరో మూడు రోజులు పెంచింది కూడా ముఖ్యమంత్రి భజన చేయడానికే కాబోలు అంటూ విమర్శలు వినపడుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !