(వీడియో)పెంపుడు కుక్కకి పిండ ప్రదానం చేసిన ఆంధ్రా రైతు

First Published Jul 31, 2017, 8:17 AM IST
Highlights
  • అంజీ ఇంట్లో కొడుకు లేని కొరత తీర్చింది
  • తొమ్మిదేళ్ల సహవాసం అంజీని ఆయన ఇంట్లో భాగం చేసింది
  • అంజీ మరణం ఆయన్ని కలచి వేసింది
  • అందుకే కొడుకులాగా సాగనంపాడు 

 

 

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం నివాసి జ్ఞాన ప్రకాశరావుకు ‘అంజీ’ తో ఎనలేని బంధం ఏర్పడింది.  తొమ్మిదేళ్లుగా  ఏళ్లుగా అంజీని ప్రాణ  ప్రదంగా పెంచాడు. అంజీ ఆయన ఇంట్లో భాగమయింది. అంజీ లేకపోతే,ప్రకాశరావుకు ఏమీ తోచదు. రోజంతా అంజీ వెంట ఉండాల్సిందే. ఇలాంటి అంజీ ఆయన్నొది పై లోకాలకు వెళ్లిపోయింది. అంజీ ఆయన  పెంపుడు కుక్క. అయితే, అది కొడుకు లేని కొరత తీర్చిందంటాడు ప్రకాశరావు.

 ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం మరణిస్తే  కన్నకొడుకు పోయినట్లనిపించింది.  అందుకే పిండప్రదానం,పెద్దకర్మలన్నీ తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.

ప్రకాశరావు వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. రెండు పాడిగేదెల కూడా ఉన్నాయి. ఇద్దరు ఆడపిల్లల కి పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించాడు. ఆడ పిల్లలు వెళ్లిపోవటంతో ప్రకాశరావు ఇంట్లో లోటు కనిపించింది. ఎంతో దిగాలుగా ఉండేవాడు. అది చూసి గ్రామానికి చెందన యాళ్ల శ్రీధర్ నూజివీడు నుంచి కుక్కు తీసుకువచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి సొంత కొడుకులాగ పెంచకున్నారు.అంజీ అనే పేరు కుక్క పిలిచేవాడు. ఈనెల  22 అంజీకి గుండెపోటుతో మరణించింది. తన కన్న కొడుకే దూరమైపోయాడన్నా తీవ్రబాధతో తల్లడిపోయారు. ఘనంగా ఆత్యక్రియలు జరిపించారు.ఈ రోజు 9వ రోజ కావటంతో శాస్త్రోక్తంగా బ్రహ్మణుడు చేత పిండ ప్రదానం చేశారు. 150 మందికి భోజనాలు పెట్టి తన ప్రేమని చాటుకున్నారు.

click me!