
ఆదుకునేందుకు అపద్బాంధవుడిలా వచ్చే అంబులెన్స్ లోనే మంటలు లేస్తే... ఈ సంఘటన ఈ రోజు హైదరాబాద్ సమీపంలోజరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మీద దూసుకు వెళ్తున్న ఒక అంబులెన్స్ లో మంటలొచ్చి అందులో ఉన్నవాళ్లంతా ఒక్క ప్రమాదంలో పడ్డారు. హైదరాబాద్ లో మరణించిన ఒక వ్యక్తి మృతదేహంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు అంబులెన్స్ వెళ్తున్నపుడు అంబులెన్సు మంటల్లో చిక్కుకుంది.
వాహనం శంషాబాద్ సమీపానికి రాగానే ఒక్కసారిగా వాహనంలో మంటలొచ్చాయి. అయితే, డ్రైవర్ అప్రమత్తమై అంబులెన్స్ ను నిలిపేసి, అందులో ఉన్నవాళ్లనందరిని క్షణాల్లో దింపేశాడు. దీనితో పెద్ద వారందరికి పెద్ద ప్రమాదం తప్పింది.
క్షణాల్లో మంటలు ఎక్కువయి, వాహనమంతా వ్యాపించాయి. చూస్తుండగానే అంబులెన్స్ మొత్తం కాలిపోయింది.
తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. మరో అంబులెన్సులో మృతదేహాన్ని అక్కడి అంధ్రకు తరలించారు.