ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేస్తానంటున్న కమల్

First Published Nov 16, 2017, 3:20 PM IST
Highlights
  • విరాళాలు వెనక్కి ఇస్తానన్న కమల్
  • కమల్ పార్టీ కోసం రూ.30కోట్లు సేకరించిన అభిమానులు

తాను పార్టీ పెట్టడానికి అభిమానులు సేకరించి ఇచ్చిన డబ్బులన్నింటినీ తిరిగి ఇచ్చేయనున్నట్లు విలక్షణ నటుడు కమల్ హాసన్ తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం తన అభిమాన సంఘం పార్టీ కోసం రూ.30కోట్ల నిధులు సేకరించిందని కమల్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ నిధులను వెనక్కి ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఒక తమిళ మ్యాగజైన్ కి రాసిన ఆర్టికల్ లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

ఇప్పటి వరకు తాను పార్టీ స్థాపించలేదని.. పార్టీకి ఒక పేరు కూడా పెట్టలేదని చెప్పారు. అలాంటి పార్టీ కోసం నిధులు సేకరించడం కరెక్ట్ కాదని అందుకే వాటిని తిరిగి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే... దీని అర్థం తాను వెనక్కి తగ్గుతున్నట్లు కాదని, భవిష్యత్తులో నిధులు స్వీకరించనని కూడా కాదని స్పష్టం చేశారు.  అంతేకాకుండా ‘హిందూ టెర్రర్’ గురించి గతంలో తాను చేసిన వ్యాఖ్యల గురించి కూడా కమల్ ప్రస్తావించారు. తాను కూడా హిందూ కుటుంభం నుంచే వచ్చానని చెప్పారు. మన దేశంలో అత్యధికంగా హిందువులే ఉన్నారని.. వారు ఇతర మతాల వారికి అన్నయ్య లాంటి వాళ్లని చెప్పారు. హిందువులు తాము ఎక్కువమంది ఉన్నామని చెప్పుకుంటారని.. అలానే వారి మనసులుకూడా పెద్దగా ఉండాలన్నారు. ఇతర మతాల వారిని అక్కున చేర్చుకోవాలి.. వారు చేసే తప్పులను సరిదిద్ధాలని కమల్ పేర్కొన్నారు.

click me!