
బతికుండగానే చంపేయడం మీడియాకే కాదు రాజకీయనేతలకు కూడా అలవాటే.. ఆ మధ్యన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను బతికుండగానే చనిపోయాడని ఓ నేత నిండు సభలో శ్రద్దాంజలి కూడా ఘటించాడు.
ఇప్పుడు భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయిని ఆయన పార్టీకే చెందిన ఓ నాయకురాలు అలాగే చంపేసింది.
మన ప్రియతమ నేత ఇక మన మధ్య లేరు. ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయని బాధాతప్త హృదయంతో మాట్లాడింది అలీఘర్ మేయర్, బీజేపీ నాయకురాలు శకుంతలా భారతి.
వాజ్ పేయి పుట్టిన రోజే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో ఆమె వెంటనే తన తప్పుకు క్షమాపణలు చెప్పారు. వాజ్ పేయి ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.