‘జియో’ ఆఫర్ ఉండేనా..!

Published : Feb 06, 2017, 03:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
‘జియో’  ఆఫర్ ఉండేనా..!

సారాంశం

కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కు ఫిర్యాదు చేసిన ఏయిర్ టెల్

చింత చచ్చినా పులుపు చావనట్టుంది ఏయిట్ టెల్ పరిస్థితి. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ తో కోట్ల లో వినియోగదారులను చేర్చుకున్న రిలయెన్స్ జియోకు చెక్ పెట్టేందుకు ఈ పోటీ టెలికాం సంస్థ ఏ ప్రయత్నాన్ని వదలడం లేదు.

 

ఇటీవల జియో ఫ్రీ  కాల్స్ పై వచ్చిన అభ్యంతరాలను ట్రాయ్ కొట్టివేసిన విషయం తెలిసిందే.  అయినా వెనక్కి తగ్గని ఏయిర్ టెల్ ఇప్పుడు  కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కు జియో ఆఫర్ పై ఫిర్యాదు చేసింది.

 

టెలికాం రంగంలో పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో రిలయెన్స్ ఇలా ఫ్రీ ఆఫర్ లతో తమను దెబ్బ తీసున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

జియో ఫ్రీ ఆఫర్ వల్ల ఇతర టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయని ఆరోపించింది.  ట్రాయ్ కూడా  జియోతో  కుమ్మక్కైందని సంచలన ఆరోపణలు చేసింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !