శశి వర్సెస్ శశి

Published : Dec 28, 2016, 09:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
శశి వర్సెస్ శశి

సారాంశం

అమ్మ పార్టీలో ముసలం ఎంపీ శశికళ పుష్ప లాయర్ పై కార్యకర్తల దాడి

 

అమ్మ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది.  అన్నాడీఎంకేలో చినమ్మ మద్దతుదారులు అప్పుడే తమ వీర విధేయతను చాటుకుంటున్నారు. 
 

పార్టీ  ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ రెబల్ ఎంపీ శశికళా పుష్ప లాయర్‌పై పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు.

 

శశికళ పుష్ప ఎవరు? ఆమెకు తమ పార్టీతో సంబంధం ఏమిటి  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

శశికళ పుష్ప తరఫున నలుగురు లాయర్లు బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. శశికళ తరుపున తాము వచ్చామని చెప్పడంతో అక్కడ ఉన్న చిన్నమ్మ విధేయులు వారిపై విరుచుకపడ్డారు. రక్తం వచ్చేలా చితకబాదారు.

 

చివరకు పోలీసులు వచ్చి అక్కడి నుంచి లాయర్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 

కాగా, పార్టీ నుంచి శశికళ పుష్ప  గతంలోనే సస్పెండ్ కు గురైన విషయం తెలిసిందే.

 

పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో తాను కూడా పోటీకి అర్హురాలని అని శశికళ పుష్ప స్పష్టం చేశారు. తన లాయర్‌పై దాడి ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !