
రజనీకాంత్ ....
ఆ పేరు వింటేనే చాలు తంబీలకు పూనకం వస్తుంది.
సూపర్ స్టార్ మానియాకు బాలీవుడ్ కూడా షేక్ అవుతుంది.
కానీ, రజనీ మాత్రం తన నిర్ణయాన్ని ఎప్పుడూ బయటకి చెప్పడం లేదు.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా సూపర్ స్టార్ ప్రకటన కోసం తమిళజనం ఎదురు చూస్తూనే ఉన్నారు.
జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో మరోసారి రజనీ రాజకీయ ప్రవేశంపై వార్తలు గుప్పుమంటున్నాయి.
రజనీ అండతో బీజేపీ తమిళనాట కమలాన్ని వికసింపజేయాలని తెగ ఆరాటపడుతోంది. అయితే ఆయన మాత్రం కషాయదళానికి దూరంగా ఉంటున్నారు.
త్వరలో రజనీ సొంతంగా పార్టీ పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఆయన పొలిటకల్ ఎంట్రీ కోసం పోస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైలో చాలా చోట్ల ఇప్పుడు రజనీ సినిమాల పొస్టర్లకు ధీటుగా ఈ పొలిటకల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.