యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త

Published : Feb 26, 2018, 01:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త

సారాంశం

యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి యాక్ట్ ఫైబర్ నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారికి కావాల్సినంత డేటా లభించబోతోంది. ఈ బంపర్ ఆఫర్ కేవలం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో నివసించే వారికి మాత్రమే ఆఫర్ చేయడం విశేషం.

చెన్నైలో నివసిస్తూ, ఇప్పటికే వివిధ  యాక్ట్ ఫైబర్ నెట్ ప్లాన్లకు సబ్ స్రైబ్ చేసినవారికి  అదనంగా 1500 జీబీ డేటాను అందించనుంది. ఈ డేటాను మార్చి ఒకటి 2018 నుండి ఆగస్టు 31, 2018 లోపు మాత్రమే ఉపయోగించుకోగలరు. ఆరు నెలల పాటు ఈ డేటాను వినియోగదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే హైదరాబాద్లో నివసించే యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు 1000జీబీ డేటా అందించనున్నారు. రెగ్యులర్ గా వినియోగదారులు ఉపయోగించే ప్లాన్ కి అదనంగా ఆ డేటా లభిస్తుంది. ఆరు నెలలు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బెంగళూరులోని వినియోగదారులకు కూడా 1000జీబీ డేటా లభించనుంది. దీనిని యాక్ట్ ఫైబర్ నెట్ వెబ్ సైట్ లో అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu