హైదరాబాద్ బిర్యానీనే టాప్..!

First Published Dec 22, 2017, 11:51 AM IST
Highlights
  • ఈ ఏడాది నగరవాసులు స్విగ్గీ యాప్ లో ... ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసారో తెలుసా.... హైదరాబాద్ బిర్యానీ(చికెన్).
  • కేలవం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా.. దేశంలోని ఏడు ప్రముఖ నగరాలపై స్విగ్గీ ఈ సర్వే చేపట్టింది.

హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన సత్తా చాటింది. కేవలం నగరవాసులనే కాకుండా.. దేశంలోని ఇతర నగరాల్లోనూ బిర్యానీ టాప్ గా నిలిచింది.  ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ.. చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది నగరవాసులు స్విగ్గీ యాప్ లో ... ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసారో తెలుసా.... హైదరాబాద్ బిర్యానీ(చికెన్).కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా.. దేశంలోని ఏడు ప్రముఖ నగరాలపై స్విగ్గీ ఈ సర్వే చేపట్టింది. కాగా.. ఈ ఏడు నగరాల్లోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యానీకే ఓటు వేయడం విశేషం. బిర్యానీ తర్వాత మసాలా దోశ, బటర్ నాన్, తందూరీ రోటీ, పనీర్ బటర్ మసాలా ఈ ఏడాది టాప్ ఫుడ్స్ గా నిలిచాయి.

మోస్ట్ సెర్చ్ చేసిన ఫుడ్..

ఇక మనదేశంలో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫుడ్ ఏమిటో తెలుసా..? పిజ్జా. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే  దాదాపు 5లక్షల సార్లు పిజ్జా గురించి సెర్చ్ చేయడం విశేషం. పిజ్జా తర్వాతి స్థానంలో బర్గర్, చికెన్, కేక్, మోమోస్ ఉన్నాయి.

హాట్ సమ్మర్ లో..

మార్చి, ఏప్రియల్, మే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఈ సమ్మర్ సీజన్ లో ఇండియన్ ఓటు జ్యూస్ లకు పడింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది జ్యూస్లు, మిల్క్ షేక్ లు ఆర్డర్ చేసిన వారు 40శాతం మంది పెరిగారు.

 బ్రేక్ ఫాస్ట్..

 బ్రేక్ ఫాస్ట్ లో మనవాళ్లు ఎక్కువగా ప్రిఫర్ చేసిన ఫుడ్స్.. మసాలా దోశ, ఇడ్లీ, వడ. కాగా.. చెన్నై నగరవాసులు మాత్రమే వారి ఫేమస్ పొంగల్ ని ఎక్కువగా ఆర్డర్ చేశారు.

 

లంచ్, డిన్నర్..

 ఇక లంచ్, డిన్నర్ వేళల్లో మాత్రం బిర్యానీకే ఎక్కువ మంది ఓటు వేశారు. దీనితోపాటు పన్నీర్ బటర్ మసాలా, మసాలా దోశ, దాల్ మఖనీ, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇక స్నాక్ విషయానికి వస్తే.. పావ్ బాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, చికెన్ రోల్, చికెన్ బర్గర్, బేల్ పూరీ

లేట్ నైట్స్..

చికెన్ బిర్యానీ, ఫ్రెంచ్  ఫ్రైస్, బటర్ చికెన్, బ్రౌనీ లాంటి ఫుడ్స్ ఫ్రిఫర్ చేస్తున్నారు. లేట్ నైట్ ఫుడ్స్ తినేవారిలో మొదటి స్థానం హైదరాబాద్ కే దక్కింది. తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి. ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో స్విగ్గీకి 2700 ఆర్డర్స్ రాగా.. అందులో 1415 ఆర్డర్లు కేవలం ఒకే వ్యక్తి నుంచి రావడం విశేషం. ఆ వ్యక్తి వివరాలు మాత్రం తెలియలేదు.

 

click me!