ముంబయి పేలుళ్లు: అబూసలెంకు జీవిత ఖైదు, ఇద్దరికి మరణ శిక్ష

First Published Sep 7, 2017, 1:20 PM IST
Highlights
  • ముంబయి పేలుళ్ల దోషులకు శిక్ష
  • ఖారు చేసిన టాడా కోర్టు

1993 నాటి ముంబయి పేలుళ్ల కేసులో దోషులయిన అబూసలేం, ముస్తఫా దోసా, కరీముల్లాఖాన్‌, ఫిరోజ్‌ అబ్దుల్‌రషీద్‌ఖాన్‌, రియాజ్‌సిద్దిఖీ, తాహిర్‌మర్చంట్‌లకు ప్రత్యేక టాడా న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేసింది. వీరిలో అబూసలెం, కరీముల్లాఖాన్‌కు జీవితఖైదుతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది. ఫిరోజ్, మర్చంట్ లకు   మరణ శిక్ష విధించింది.రియాజ్ సిద్ధిఖికి పదేళ్ల జైలు శిక్ష పడింది.

భారతదేశాన్ని అతలాకుతలం చేసిన ఈ కేసుకు సంబంధించి జూన్‌లో  రెండో విడత విచారణ పూర్తయింది. వీరంతా దోషులని తేలింది.  దోషుల్లో ఒకరు,  ముస్తఫా దోసా, గుండెపోటుతో మరణించాడు. దీంతో మిగతా ఐదుగురికి కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. వీరంతా భారతదేశం మీద యుద్ధం  ప్రకటించారని, హత్యలకు పూనుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. హిందీ నటుడు సంజయ్ దత్ ఎకె.56 రైఫిల్స్ కేసు కూడా దీనికి సంబంధించినదే. ఆయనకు అబు సలేం వీటిని అందిచారని ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని గతంలోనే కోర్టు ప్రకటించింది.

 గత తీర్పు జూన్‌16న తీర్పు వెలువరింనిపుపుడు  ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్‌ అబూసలేంలతో పాటు ఆరుగురిని దోషులుగా తేల్చింది. ఆధారాల్లేనందున మరో నిందితుడు అబ్దుల్‌ ఖయ్యూమ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దోషుల్లో ఒకరయిన ముస్తఫా దోసా గుండెపోటుతో మృతిచెందాడు.


1993 మార్చి 12న ముంబయి నగరం పేలుళ్లతో అట్టుడికింది. రెండు గంటల వ్యవధిలో ఉగ్రవాదులు వరుసగా 12 చోట్ల పేలుడు పదార్ధాలతో భవనాలను కూల్చేప్రయత్నం చేశారు.  మారణ హోమం సృష్టించేందుకు అనువయిన చోట్లల్లా పేలుళ్లు జరిపారు.  ఈ ఘటనలో 257 మంది చనిపోయారు. 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు వెనక కుట్ర ఛేదించేందుకు దర్యాప్తును  సీబీఐకి అప్పగించారు.  బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ముంబయి మాఫియా కు చెందిన దావూద్‌ఇబ్రహీం, టైగర్‌మెమన్‌, మహ్మద్‌దోసా, ముస్తఫా దోసాలు కుట్ర పన్ని ఈ బీభత్సం సృష్టించారని సిబీఐ తన దర్యాప్తు తేలింది.  ప్రత్యేక టాడా న్యాయస్థానం 2007లో కేసు విచారణ పూర్తి చేసింది. అందులో 100 మందిని దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరైన యాకూబ్‌మెమన్‌కు 2013లో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2015లో ఈ శిక్షను అమలు చేశారు. అయితే కేసు విచారణ ముగిసే సమయంలో ముంబయి పేలుళ్లతో సంబంధం ఉందంటూ ముస్తఫా దోసా, అబుసలెం సహా మరో ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో వీరిని ప్రధాన విచారణ నుంచి వేరు చేసి రెండో విడత విచారణ చేపట్టాల్సి వచ్చింది టాడా కోర్టు. దీని ఫలితమే నేటి తీర్పు.

 

 మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

click me!