
ప్రభుత్వం ఎప్పుడు బలమైనదే,కిరణ కుమార్ రెడ్డి ప్రభుత్వం exception!1996 తరువాత ఇంత హోరాహోరి ఉప ఎన్నికలు ఇవే...రాష్ట్ర రాజకీయల్లొ ఓటుకు 500 పంచిన తొలి ఎన్నిక 1996 నర్సాపురం ఉప ఎన్నిక. ఓటుకు 5000 పంచుతారన్న మాట వినిపించిన మొదటి ఎన్నిక ఈ నంద్యాల ఉప ఎన్నిక. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు 3:1 అంటే 3000:1000 పంచాయని వార్త. పోలింగ్ జరిగే బుధవారంలోపు అధికార పక్షం మరో రెండు వేలు,ప్రతిపక్షం వెయ్యి పంచుతారని అంచన.
TDP సంస్థాగత బలం గురించి అందరికి తెలిసిందే.YCP ఏర్పడిన తరువాత మొదటిసారి Team and Planned work ఈ నంద్యాల ఉప ఎన్నికలో కనిపిస్తుంది,పార్టి పనితీరులో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తుంది.
జగన్ 10 రోజులపాటు నంద్యాల్లొనే వుండి ప్రచారం చెయ్యటం చాలా సహసపూరిత నిర్ణయం,ఫలితం ఏమాత్రం తేడాగా వచ్చినా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన జగన్ సాహసించారు.
నంద్యాల్లొ ఓడినా TDP మీద ఈగ వాలనీయకుండ అసలు నంద్యాల ఎన్నిక ముఖ్యమైనది కాదు అన్నట్లు కవర్ చేయ్యటానికి ఈనాడు,ఆంధ్రజ్యోతి వున్నాయి.TDP యువ నాయకుడు లోకేష్ గారు ప్రచారానికి దూరంగా వుండటం కూడ ముందు జాగర్త చర్యల్లొ భాగం కావొచ్చు.TDP గెలిస్తే అభ్యర్ధి నుంచి మంత్రులు చివరికి ముఖ్యమంత్రిగారు కూడ లోకేష్ గారిదే ఈ విజయం అని ఎలాగు చెప్తారు.
ప్రచారం తొలిదశలొ అధికారపక్షం చేసిన సున్నిత ప్రచారం ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డిగారు గెలిచినా జగన్ ముఖ్యమంత్రి కారు కదా?అదే TDP భూమా బ్రహ్మనందరెడ్డిగారు గెలిస్తే అభివృద్ది పనులు కొనసాగుతాయి,రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి మంచి పరిహారం ఇస్తారు అన్న ప్రచారం ఓటర్ల మీద ఒక మేర ప్రభావం చూపింది.కాని జగన్ పదిరోజులు నంద్యాల్లోనే వుండి ప్రచారం చెయ్యటంతో ఓటర్లలో మార్పు వచ్చింది.
మొదట శిల్పా మోహన్ రెడ్డి vs చంద్రబాబు అన్నట్లు సాగిన ప్రచారం జగన్ నంద్యాల రాకతో జగన్ vs చంద్రబాబుగా మారింది.ఈమార్పు YCP మద్దతుదారుల్లొ సీరియస్ నెస్ పెంచింది.
కులం ఆధారంగా ఓట్లు అడిగేవారిని కొట్టండి అన్న మంత్రులు కులాలవారిగా ఆత్మీయ సమావేశాలు పెట్టి ఓట్లు అడిగారు. YCP కూడ కొన్ని కులల ఆత్మీయ సమవేశాలు ఏర్పాటు చేసింది.
మొదటి నుంచి ఏకపక్షంగా TDPకి మద్దతు ఇచ్చే బలిజలు ఈసారి వారి సమావేశంలో TDPకి అనుకూలంగా తీర్మానం చెయ్యకపోవటంతో ఈ ఎన్నికల్లొ బలిజల ఓట్లు TDPకి గుత్తగా పడే అవకాశాలు లేవు.బలిజల కళ్యాణ మండపం విషయంలొ ప్రభుత్వ వైఖరితో విభేదిస్తున్నారు.
కర్నూల్ జిల్లా వైశ్య సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు గారు మరియు,మాజి ఫైనన్స్ కార్పోరేషన్ చైర్మన్ రోశయ్యగారి శిష్యుడు శ్రిఘకోల్లపు శివసుబ్రమణ్యం YCPలో చేరటం YCPకి కలిసివచ్చే అంశం.
రెడ్లలొ వున్న తెగలు/ఉప కులాల రాజకీయం పెద్దగా ఫలితం ఇచ్చినట్లు లేదు.మొదట నెరవాటి, మోటాటి,పెడకంటి,కొడిద లాంటి రెడ్డి ఉప కులాల ఆధారంగా ఓట్లు కూడగట్టే ప్రయత్నాన్ని TDP త్వరగానే విరమించుకుంది.
54000 ఓట్లు వున్న ముస్లింలలో ఎక్కువ శాతం TDPకే అనుకూలంగా వున్నా YCPకి కూడ గణనీయమైన మద్దతు వుంది.2014 ఎన్నికల్లో SDPI(ముస్లింల అభివృద్దికి కృష్షి చేసె సంస్థ) నాయకుడు హబిబుల్లా 6000 ఓట్లు సాదించారు.ఈ ఉప ఎన్నికల సందర్భంగా హబిబుల్లాగారు YCPలో చేరారు.నిన్న ఫరూక్ మేనల్లుడు కూడ YCPలో చేరారు.
శిలా సోదరులది రాజకీయ కుటుంబం కాదు,రాజకీయల్లొ ఎదగటానికి సేవను మార్గంగా ఎంచుకున్నారు.1999 ఎన్నికల నాటికి శిల్పా మోహన్ రెడ్డిగారు TDPలోనే వుండేవారు.2000 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రేస్ తరుపున చైర్మన్ పదవి టికెట్ కోసం పోటిపడ్డారు.1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా స్వల్ప తేడాతో(3800) ఓడిపోయిన SPY రెడ్డిగారు కాంగ్రేసు తరుపున నంద్యాల చైర్మన్ అయ్యారు.
1999 నాటి కరువు రోజుల్లొ SPYగారు ఒక రూపాయైకే రొట్టె+పప్పు అందిస్తే శిల్పా నందిరైతు సమైఖ్య పేరుతో రైతులకు వడ్డిలేని మరియు పావలా వడ్డి రుణాలు ఇచ్చారు.ఆతరువాత శిల్పా సహకార బ్యాంక్,మహిళా సంఘాలు ఇలా అనేక సేవా సంస్థల ద్వార కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా సహాయపడ్డారు.ప్రస్తుతం శిల్పా సహకార సంఘాలలో దాదాపు 35000 మంది సభ్యులు వున్నట్లు అంచనా.
శిల్పా బలం ప్రజలతో నేరుగా వున్న సంబధాలే.ఈఎన్నికల్లొ కాస్త ఇబ్బంది కలిగించే అంశం SPY కుటుంబం TDP తరుపున గట్టిగా పనిచేయటం.శిల్పా సంఘాల్లొ సభ్యులు శిల్పా మీద కృతజ్ఞత చూపించినట్లే SPY సంస్థల్లొ పనిచేసే ఉద్యోగులు TDP వైపు మొగ్గు చూపించవచ్చు.
1983 నుంచి ముస్లిం నాయకుడిగా 85,94,99 ఎన్నికల్లో గెలిచిన ఫరూక్ గారు ఆతరువాత ఏ ఎన్నికల్లొ గెలవలేదు. మొన్న 2014లొ MPగా పోటిచేసి ఓడిపోయారు.రోడ్డు విస్తరణ పనులు ఫరూక్ సినిమాహాల్ "రాజ్ థియటర్" కన్నా కొంచం ముందే ఆగిపోవటం,ఫరూక్ ఆస్తులకు నష్టం లేకండ కూల్చివేతలు జరగటం స్థానికులకు అంతర్గతంగా కోపంవుంది.
ఫరూక్ గారికి నాలుగు దశాబ్ధాలుగా ప్రత్యర్ధిగా వున్న పాత కాంగ్రేస్ నాయకుడు "నౌమన్" 2014లొ శిల్పాకు మద్దతు ఇచ్చారు,ఈ ఉప ఎన్నికల సందర్భంగా TDPలో చేరి ఉర్దు అకాడమి చైర్మన్ అయ్యారు.రాజకీయల్లొ నౌమన్ అంత అదృష్టవంతులు అరుదు, కాంగ్రేస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మున్సిపల్ చైర్మన్, APPSC మెంబర్,హజ్ కమిటి ఇలా ఎదో ఒక పదవి దక్కింది. ఇప్పుడు TDP ప్రభుత్వంలో ఉర్దు అకాడమి చైర్మన్ అయ్యారు.
ఈ ఎన్నికల సందర్భంగా TDPలో చేరిన "నేషనల్ కాలేజి" ఇంతియాజ్ అహ్మద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిలేదు,100 ఓట్లు కూడ లేవు. ఇంతియాజ్ గారు TDPలో చేరటంతో ఆయనతో వైరం వున్న TDP మద్దతుదారుడైన రామకృష్ణ కాలేజి "రామకృష్ణా రెడ్డి"గారు YCPలొ చేరారు. ఫరూక్ ,నౌమన్ ఇద్దరు కలిసి కూడ మొత్తం ముస్లింలను TDP వైపు మళ్ళించలేరు,వీళ్ళ ఇద్దరి హవా 2004 ఎన్నికలతోనే ముగిసింది.
మొన్న TDPలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డిగారి గురించి చెప్పటానికి పెద్దగా ఏమిలేదు.ఆయన 2014 ఎన్నికల్లో కాంగ్రేసులోనే వుండి TDP తరుపున పోటిచేసిన ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు.2 నెలల కిందట జగన్ను కలిశారు కాని YCPలో చేరలేదు.ఇప్పుడు TDPలో చేరి బాబుగారు చిరకాల మిత్రుడు,భూమాతో వైరంలేదు అని ప్రకటించారు.
గంగుల ప్రతాప్ రెడ్డి భూమాతో ఎప్పుడు విభేధాలు చెప్పటం ఆయన అనుచరుల్లో రాజకీయలు మనకు అనవసరం అన్న అభిప్రాయం పెరిగింది. 2004 ఎనికల్లొ ఇలానే వర్గాన్ని పట్టించుకోకుండ గంగుల ప్రభాకర్ రెడ్డి TDPలోచేరి భూమాకు మద్దతు ఇచ్చినా భూమా నాగిరెడ్డి ఓడిపోయారు. ఆతరువాత భూమా నాగిరెడ్డిగారు ఒక ఇంటర్యూలో ప్రభాకర్ రెడ్డి TDPలోకి రావటంతో తన అనుచరులు ఎన్నికలను పట్టించుకోలేదు అందుకే ఓడిపోయానని చెప్పారు.ప్రతాప్ రెడ్డిగారు మైసురా రెడ్డి,గాదే వెంకట్ రెడ్డి సరసన చేరటం ఖాయం!
రాకేష్ రెడ్డి,ప్రహ్లాద్ రెడ్డి,మునగాల సోదరులు ఇలా 2014లొ కాంగ్రేస్,TDPలో వున్న నాయకులు ఇప్పుడు YCPలో చేరటం అదనపు బలం.
5000 ఓట్లు ప్రభావితం చేసే ముఖ్యంగా ఫ్యాక్టరి కార్మికులు, NGOల్లో పట్టువున్న CPM శిల్పాకు మద్దతు ఇవ్వటం YCPకి కలిసివచ్చే మరో అంశం.
నంద్యాల్లొ సుమారు 15000 ఉద్యోగస్తుల కుటుంబాలు నివాసం వుంటున్నాయి. అంటే ఉద్యోగస్తుల కుటుంబాల ఓట్లు సుమారు 35 వేల నుంచి 40 వేలు వుంటాయి.6 నెలల కింద జరిగిన graduates MLCగా YCP తరుపున NGO Association మాజి నాయకుడు వెన్నపూస గోపాల్ రెడ్డిగారు గెలిచారు.ఉద్యోగస్తుల ఓట్లు YCPకే ఎక్కువ పడొచ్చు.
అమలాపురం మాజి MP హర్షకుమార్ నంద్యాల్లొ TDPని ఓడించమని ర్యాలి చెయ్యటం విశేషం.
ఎన్నికల ప్రచార మొదటి దశలొ అధికార పక్షం పోలింగ్ శాతన్ని తగ్గించటానికి ప్రయత్నం చేసింది.ఒక దశలో 65% అన్న పోలింగ్ జరుగుతుందా అనిపించింది. కాని ప్రచారం ఊపందుకున్న తరువాత ఇరుపక్షాలు పోలింగ్ శాతం పెంచటానికి ప్రయత్నంచేశాయి.పోలింగ్ ప్రశాంతంగా జరిగితే 75% కన్నా ఎక్కువ ఓట్లు పోల్ అవ్వటానికి అవకాశం వుంది.
ఉప ఎన్నిక కోసం పోలీసు బలగాలు భారీగా ఉపయోగిస్తున్నరు. IPS-5,DSP-32,CI-85,దాదాపు 200 మంది SIలు & APSC పోలీసులు విధి నిర్వహణలో వున్నారు.
ఇంత రాసి అంచనా కాదు విశ్లేషణ అని అనటం ఎందుకు?YCP గెలుస్తుందని చెప్పొచ్చు కదా?గెలుపు గురించి చెప్పకపోవటానికి ముఖ్యకారణం నంద్యాల ఫ్యాక్సన్ నియోజకవర్గం కాదు, నాయకులకు స్థిరమైన ముఠాలు,వర్గాలు లేవు.
నంద్యాలలాంటి నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైన తరువాత కూడ వేవ్ మారటానికి అవకాశం వుంది.54000 ఓట్లు వున్న ముస్లింలలో నడిగడ్డలోనే 75% వున్నారు.ఇలాంటి ప్రాంతాంలో రాత్రికి రాత్రి మార్పు తీసుకొనిరావటానికి అధికారపక్షానికి అవకాశం ఎక్కువ.
కొన్ని సామాజిక వర్గాల్లో కళ్యాణ మండపాలు,గుడులు(యాదవుల కృష్ణుడి గుడికి TDP హామి ఇచ్చింది)కు సంబంధించిన హామీల్లొ వచ్చిన తేడాల వలన ఆయా సామాజిక వర్గాల ఓటర్లలొ చీలిక వచ్చింది,చివరి రెండు రోజుల్లో ఈపరిస్థితిని చక్కదిద్దటానికి అధికార పక్షం ప్రయత్నం చెయ్యవచ్చు.రోడ్డు విస్తరణలో ఆస్తినష్టం జరిగినవారికి కూడ అర్ధరాత్రి ఊహించని ప్యాకేజి ఇవ్వవచ్చు. కాంగ్రేసు తరుపున పొటిచేస్తున్న ముస్లిం అభ్యర్ధి పోటిలో ఎంత గట్టిగా నిలబడతారో చూడాలి.
పైన రాసిన అంశాల అన్నిటితో 6-7వేల ఓట్లు మార్చుకోగలిగితే తీవ్రపోటి నెలకొంటుంది,TDPకి కొంత అవకాశాలు వుండవచ్చు.
పైన రాసిన అంశల్లొ మార్పు రాకుండ వుంటే శిల్పా విజయం అది కూడ 12000 కన్నా ఎక్కువ మెజారిటీతో సాధ్యం అవుతుంది. శిల్పాకు అనుకూలంగా సానుభూతి పొంగితే మెజారిటీ 25000 కూడ దాటవచ్చు.భూమా మరణం వలన కలిగే సానుభూతి ఈపాటికే కొంతమందిలొ వుంది,ఈ రెండు రోజుల్లో కొత్తగా చేరే సానుభూతి ఓట్లు ఏమి వుండకపోవచ్చు.
ఈ రెండు రొజుల్లొ TDPకి ప్రతికూలం కావటానికి వున్న అవకాశాల్లొ ముఖ్యమైనది బహుముఖ నాయకత్వం.గంగుల ప్రతాప్ రెడ్డి రాకతో నంద్యాల MP seatకు SPY రెడ్డి కుటుంబానికి పోటి ఏర్పడింది.ఇప్పుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలిస్తే ఫరూక్ కొడుక్కు MLAగా పోటిచేసే అవకాశాలు దెబ్బతినటం, AVసుబ్బారెడ్డి ఎప్పటికి ద్వితియశ్రేణి నాయకుడిగానే మిగిలిపోతారా అనే అంశం.. వీరందరు ఎంత గట్టిగా పనిచేస్తారు అన్నది చాలా ముఖ్యమైన అంశం.
TDP ప్రచారంలో నేను ఆసక్తిగా ఎదురు చూసిన అంశం "పట్టిసీమ",బాబుగారు కాని మంత్రులు కాని పట్టిసీమ పేరు ప్రస్తావనలేకుండానే ప్రచారం ముగించారు.
The win is around the corner and the winner is .....!
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి