
నిన్న ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ అసభ్యంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు చింపివేయడంపై ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. తన ట్విట్టర్ వేదికగా ‘తాతయ్యా, చిల్’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.
నాంపల్లిలోని గాంధీభవన్ లో నిన్నజరిగిన ఓ సమావేశానికి హాజరైన వీహెచ్ తిరిగి వెళుతుండగా, ఓ ఆర్టీసీ బస్సుపై ఈ చిత్రం పోస్టర్ ను చూశారు. దీంతో, వెంటనే ఆ బస్సును ఆపించి కండక్టర్ సాయంతో ఆ పోస్టర్ ను తొలగించి వేశారు. ఈ ఫొటో వైరల్ అయి, ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండకు చేరడంతో ఆయన స్పందించాడు. ఇదిలా ఉండగా,డబ్బు కోసం ఇలాంటి ప్రకటనలను బస్సులపై ఉంచడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రజలకు రోడ్లపై తిరుగుతున్న బస్సుల ద్వారా ఇలాంటి ఫోటోలు పెట్టి ఎలాంటి సందేషాలు ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శుక్రవారం విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ అకౌంట్ లో వీహెచ్ చించుతున్న అర్జున్ రెడ్డి ఫోటోను పెట్టి తాతయ్య చిల్ అని నవ్వుతున్న ఈమోజీని యాడ్ చేశాడు...
ఇప్పుడు వీహెచ్ వంతు మరీ ఆయన విజయ్ కామేంట్ కి ఎలా స్పందిస్తాడో చూడాలి.
మరిన్ని తాజా వార్తా విశేషాలకోసం క్లిక్ చేయండి
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి