4జీ కాలం పోయే.. ఇక 5జీ

First Published Mar 28, 2018, 11:05 AM IST
Highlights
త్వరలో భారత్ కి 5జీ నెట్ వర్క్

మొబైల్ నెట్ వర్క్, కమ్యూనికేషన్ రంగంలో ఇప్పటి వరకు మనం 2జీ, 3జీ, 4జీ నెట్ వర్క్ లను చూశాం. ఇప్పటికే చాలా మంది 4జీ నెట్ వర్క్ ని మాత్రమే వినియోగిస్తున్నారు. కాగా.. త్వరలో 4జీ కాలం కూడా చెల్లిపోనుంది. 5జీ నెట్ వర్క్ అడుగుపెట్టనుంది. ఈ 5జీని మొదటగా భారత్ కే తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ లోనే టెలికం, ఐ.టి, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీలతో కూడిన ఓ ఫోరంని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కూడా నియమించారు. భారతదేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు సంబంధించి రోడ్డు మ్యాప్‌ని ఈ ఫోరం ఈ ఏడాది జూన్ నాటికి తీసుకొస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సెక్రటరీ అరుణ సుందరరాజన్ పేర్కొన్నారు. 5జీ స్పెక్ట్రమ్ పాలసీ ఎలా ఉండాలి అన్నది, రెగ్యులేటరీ విధానం, దేశంలో 5జీ అమలుకు సంబంధించి  ప్రోగ్రాములు వంటి పలు అంశాలపై కూడా ఈ ఫోరమ్ దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు.

2020 నాటికి భారతదేశంలో 5జీని ప్రవేశపెట్టనున్నామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి టెలికం పరిశ్రమ, స్టార్టప్ కంపెనీలు తమ వంతు పాత్ర పోషించి 5జీ టెక్నాలజీ విషయంలో దేశం అగ్ర స్థానంలో ఉండటానికి సహకరించాలని ఆమె కోరారు.

click me!