చట్టం ముందు న్యాయమూర్తులు కూడా సమానమే

First Published Sep 29, 2017, 11:38 AM IST
Highlights
  • ఇద్దరు న్యాయమూర్తులను విధులనుంచి బహిష్కరించిన న్యాయస్థానం
  • చట్టాన్ని వ్యతిరేకించినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్న న్యాయస్థానం

చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని అతిక్రమిస్తే.. ఎవరైనా మూల్యం చెల్లించకతప్పదు. ఇందుకు నిదర్శనమే మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన. ఎవరైనా తప్పుచేసినా, చట్టాన్ని అతిక్రమించినా.. కోర్టులో న్యాయమూర్తులు శిక్షలు వేస్తారు. మరి ఆ న్యాయమూర్తులే చట్టాన్ని అతిక్రమిస్తే.. తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మనోజ్ కుమార్, అష్రఫ్ అలీ అనే ఇద్దరు న్యాయమూర్తులుగా శిక్షణ అభ్యసిస్తున్నారు. గతేడాది శిక్షణలో చేరిన వీరిని ఇటీవల మధ్య ప్రదేశ్ న్యాయస్థానం డిస్ మిస్ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలి. అంతకు మించి పిల్లలు ఉండకూడదు. ఈ నియమాన్ని ఇద్దరు ట్రైనీ న్యాయమూర్తులు విస్మరించారు.

దీంతో ఇటీవల నిర్వహించిన హైకోర్టు న్యాయమూర్తలు సమావేశంలో మనోజ్ కుమార్, అష్రఫ్ అలీలను ఉన్నతాధికారులు విధుల నుంచి బహిష్కరించారు. ఇదరు కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నందుకే వారిని విధుల నుంచి తొలగించినట్లు న్యాయస్థానం తెలిపింది.

click me!