నాలుగువేల కోట్ల కోసమే... స్థానికసంస్థల ఎన్నికలతో చంద్రబాబు కుట్రలు: మంత్రి అనిల్ యాదవ్

By Arun Kumar PFirst Published Mar 4, 2020, 10:25 PM IST
Highlights

స్థానికసంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ తగ్గడానికి సీఎం జగనే  కారణమంటూ మాజీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.  

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిసి రిజర్వేషన్లపై మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి బిసిలు టిడిపి మద్దతుగా నిలుస్తూ వచ్చారని... అలాంటిది చంద్రబాబు 35 ఏళ్ల నుండి వారికి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన వారికి రిజర్వేషన్లు ఇవ్వడంలేదని సీఎం జగన్ ను విమర్శించడం తగదన్నారు.   

నామినేటెడ్ పోస్టుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత సీఎం జగన్ దే అని ప్రశంసించారు. 2018 లో ఏపి ప్రభుత్వం కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేసిందని...  తెలంగాణ కి ఇచ్చిన తీర్పు మాకు వర్తిస్తుంది అని చంద్రబాబు ప్రభుత్వం వాదించిందని అన్నారు. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ 2013 ఎన్నికల వరకే పరిమితం అని చంద్రబాబు అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. 

read more  హైదరాబాద్, ఏలూరుల్లో కరోనా కలకలం... తెలుగు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

తర్వాత ఎన్నికలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ వర్తించదని చంద్రబాబే పేర్కొన్నట్లు మంత్రి గుర్తుచేశారు.ఇప్పుడు అదే చంద్రబాబు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి తో కేసు వేయించారని ఆరోపించారు. టిడిపి హయాంలో ప్రతాప్ రెడ్డి ఉపాధి హామీ డైరెక్టర్ గా ఉన్నారని గుర్తుచేశారు. ఇలా బీసీలను మళ్లీ చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

బీసీలను తిట్టడానికి చంద్రబాబు పేటెంట్ ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే రూ.4000 కోట్లు నిధులు వెనక్కి వెళతాయి కాబట్టి ఎన్నికలు ఆపి ఆ నాలుగు వేలకోట్ల నిధులు అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రచేస్తున్నారని విమర్శించారు. 

 read more కరోనా వైరస్ రూ. 51 లక్షల కోట్లే... కానీ ఏపిలో అంతకంటే డేంజర్ వైరస్...: దేవినేని ఉమ

పొద్దున నిద్ర లేస్తూనే చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి యనమల కూడా బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పనుల వల్ల 2024 ఎన్నికల్లో టిడిపికి 23 సీట్ల కూడా రావని అన్నారు. ఎన్నికలకు వస్తే ఎదుర్కోవడం చంద్రబాబు నేర్చుకోవాలని...స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తేలుతుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 

click me!