వైసిపి ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేయడంతో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గుండెల్లో గుబులు మొదలయ్యిందని వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
తాడేపల్లి: రాష్ట్ర చరిత్రలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక విఫల నాయకుడని వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తన ఐదేళ్ల పాలనపై ఆత్మపరిశీలన చేసుకోకుండా సీఎం జగన్ ను నరకాసురుడని విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు జగన్ లో నరకాసురుడు కనిపిస్తున్నాడా లేక ఆయన అవినీతిని బైట పెట్టినందుకు కనిపిస్తున్నాడా... అని ప్రశ్నించారు.
కేవలం 9 నెలల్లోనే రాజన్న రాజ్యాన్ని మించి జగనన్న రాజ్యాన్ని వైసిపి ప్రభుత్వం తెచ్చిందన్నారు. భస్మాసురుడికే చంద్రబాబు పెద్దన్న అని... అందువల్ల ఆయనకంటే భస్మాసుర హస్తం మరెవరిది వుండదని అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం తగలబడి పోయిందన్నారు.
undefined
read more ట్రంప్ విందుకు జగన్ కు రాని ఆహ్వానం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ పై విమర్శలు చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. జనాలు లేక జన చైతన్య యాత్రలు వెల వెల బోతున్నాయన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పాల్సింది పోయి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం తగదన్నారు.
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ఆ ఎన్నికలు వాయిదా వేయించాడనికి సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నది చంద్రబాబేనని మండిపడ్డారు.
చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే ఎందుకు సిట్ వేస్తే ఎందుకు భయపడుతున్నారని అడిగారు. సిట్ ఏర్పాటు తో టీడీపీ నేతలు, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. ఓవైపు చంద్రబాబు జనాదారణ లేని జనచైతన్య యాత్రలు చేస్తుంటే మరోవైపు జగన్ దేశంలో ఎవరూ ఇవ్వలేని జనరంజక పాలన అందిస్తున్నాడని తెలిపారు.
చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేదని...జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. స్థానిక ఎన్నికలకు టీడీపీకి అభ్యర్థులు లేక ఎన్నికలను అడ్డుకుంటున్నారని... లిటికేషన్ లు పెట్టి కోర్టుల్లో వాయిదాలు వేయిస్తున్నారని ఆరోపించారు.
read more జగన్ సర్కార్‌కు షాక్: ఐఆర్ఎస్ అధికారి సస్పెన్షన్ రద్దు
చంద్రబాబు బిసిల రాజకీయ అవకాశాల్ని ఊచకోత కొస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను అనగదొక్కింది చంద్రబాబేనని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే పని చేస్తున్నారని అన్నారు. తప్పు చేశారు కనుకే సిట్ ఏర్పాటును తప్పుబడుతున్నారని... అసలేం తప్పు చెయ్యనప్పుడు భయం ఎందుకు..? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.