స్టాప్ నర్సుపై లైంగిక దాడి: పీఎస్‌ నుండి తప్పించుకొన్న డాక్టర్, గత చరిత్ర ఇదీ...

By narsimha lodeFirst Published Feb 13, 2020, 10:50 AM IST
Highlights

ఉదయగిరి పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్పుపై లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూరు బుధవారం నాడు రాత్రి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొన్నాడు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యాడు. 

నెల్లూరు: స్టాఫ్ నర్సుపై లైంగికంగా దాడికి దిగిన  డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూరు బుధవారం నాడు రాత్రి ఉదయం పోలీసు స్టేషన్ నుండి తప్పించుకొన్నారు. ఈ విషయమై పోలీసుల తీరుపై బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. సీఐ సత్యనారాయణను వివరణ కోరారు.

 నెల్లూరు జిల్లా ఉదయగిరి  ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుపై లైంగిక దాడికి పాల్పడిన  డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూరు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్ నుండి అదృశ్యమయ్యారు. డాక్టర్ తప్పించుకొన్నాడా.. లేక పోలీసులే ఉద్దేశ్యపూర్వకంగా అతడిని తప్పించారా  అనే   అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

నిందితుడు డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ను కోర్టుకు తరలించడానికి కొన్ని క్షణాల ముందు ఆయన తప్పించుకోవడంపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్థానిక సీఐ సత్యనారాయణను వివరణ కోరారు. బుధవారం నాడు రాత్రి నుండి డాక్టర్ రవీంద్రనాథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.పోలీస్ స్టేషన్ నుండి డాక్టర్ అదృశ్యం కావడంపై సీఐను పోలీసు ఉన్నతాధికారులు వివరణ కోరారు.  

తీరు మారని డాక్టర్

డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తీరు మాత్రం ఇంకా మారలేదు. గతంలో కూడ అనేక మార్లు ఇదే రకమైన ఘటనలకు ఆయన పాల్పడినట్టుగా  ఆరోపణలు ఉన్నాయి. 
తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని లైంగికంగా లొంగ దీసుకునేందుకు డాక్టర్ రవీంద్రనాథ్ ప్రయత్నాలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.

డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూరు  పొదలకూరు ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే సమయంలో తమ వద్దకు వైద్యం కోసం వచ్చిన ఓ గర్భిణితో అభస్యకరంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. తమ పలుకుబడి ఉపయోగించుకుని తక్కువ సమయంలోనే తిరిగి విధుల్లో చేరాడు. ఆయన పని చేసిన ప్రతి చోట నర్సులను ఇదే విధంగా వేధించే వారనే ఆరోపణలు ఉన్నాయి.   

లైంగిక ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా ఇప్పటికే డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూరు‌ రెండు దఫాలు సస్పెన్షన్‌కు గురయ్యారు.  ముత్యాలరాజు కలెక్టర్‌గా ఉన్నప్పుడు పొదలకూరులో పని చేసేటప్పుడు ఇలా ఓ నర్సును వేధించిన విషయంలో క్రిమినల్‌ కేసును ఎదుర్కొన్నారు. పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజకీయ జోక్యం, యూనియన్‌ నాయకుల అండతో ఎలాగోలా బయటపడ్డారని ప్రచారం సాగుతోంది.

Also read:స్టాఫ్ నర్సుపై డాక్టర్ లైంగిక దాడి: చితక్కొట్టిన కుటుంబసభ్యులు

ఉదయగిరి ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుపై అత్యాచారయత్నానికి పాల్పడిన డాక్టర్ రవీంద్రనాథ్ పై వైద్య ఆరోగ్యశాఖాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఈ ఘటనపై డాక్టర్‌పై చర్యలు తీసుకొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్దం చేసినట్టుగా సమాచారం.

ఇటీవల అల్లూరు మండలం ఇస్కపల్లి పీహెచ్‌సీ లో పనిచేస్తున్న ఒక ఆశా కార్యకర్తనను అక్కడ పని చేసే డాక్టర్‌ లైంగికంగా వేధించసాగాడు. దీంతో అక్కడున్న నర్సింగ్‌ సిబ్బందంతా కలిసి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సూచన మేరకు విషయాన్ని పరిశీలించిన కలెక్టర్‌ శేషగిరిబాబు ఆ డాక్టర్‌ను వైద్యశాఖకు సరెండర్‌ చేశారు. 
 

click me!